మెట్రో ఉద్యోగిని పొడిచి.. రూ. 12 లక్షలతో పరారీ | delhi metro official stabbed, rs 12 lakhs stolen | Sakshi
Sakshi News home page

మెట్రో ఉద్యోగిని పొడిచి.. రూ. 12 లక్షలతో పరారీ

Published Mon, Apr 11 2016 2:20 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

మెట్రో ఉద్యోగిని పొడిచి.. రూ. 12 లక్షలతో పరారీ

మెట్రో ఉద్యోగిని పొడిచి.. రూ. 12 లక్షలతో పరారీ

అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే మెట్రో రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. ఢిల్లీలోని రాజేంద్రనగర్ మెట్రో స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి, ఓ ఉద్యోగిని స్టేషన్ ఆవరణలోనే పొడిచేసి.. రూ. 12 లక్షలతో అక్కడి నుంచి పరారయ్యారు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే మెట్రో రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. ఢిల్లీలోని రాజేంద్రనగర్ మెట్రో స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి, ఓ ఉద్యోగిని స్టేషన్ ఆవరణలోనే పొడిచేసి.. రూ. 12 లక్షలతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో జరిగింది.

నేరుగా స్టేషన్‌లోకి ప్రవేశించిన ఆగంతకులు నేరుగా కంట్రోల్ రూంలోకి వెళ్లారు. అక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. పొద్దున్న మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం కావడానికి ముందే వాళ్లు చాకుతో లోపలకు రావడంతో.. మెట్రో భద్రతా చర్యల్లో డొల్లతనం బయట పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దాడి వ్యవహారం సీసీ టీవీ కెమెరాలలో రికార్డు అయిందో లేదో మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement