న్యూఢిల్లీ: బుల్లెట్ వేగంతో దూసుకుపోతున్న మెట్రో రైలు నుంచి ఓ వ్యక్తి దూకాడు. ఆ ఘటనలో సదరు వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఆ సంఘటన గురువారం న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. ద్వారకా నుంచి నోయిడా వైపు దూసుకుపోతున్న ట్రైన్ నుంచి వ్యక్తి దూకడంతో రైలులోని ప్రయాణికులు వెంటనే ట్రైన్ ఆపివేశారు.
అనంతరం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.