ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించిన దత్తాత్రేయ | Bandaru Dattatreya travelled in delhi metro train | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించిన దత్తాత్రేయ

Published Tue, Nov 11 2014 9:12 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

బండారు దత్తాత్రేయ(ఫైల్)

బండారు దత్తాత్రేయ(ఫైల్)

న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం ఢిల్లీ మెట్రోరైలులోప్రయాణించారు. విమానాశ్రయం నుంచి శివాజీ స్టేడియం వరకు మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మెట్రో రైలు లాంటి ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణించడం ఆనందంగా ఉందని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.

కాగా, కార్మిక చట్టాల్లో మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టనున్న దత్తాత్రేయ వెల్లడించారు. అన్నివర్గాల ప్రయోజనాలను కాపాడేలా సంస్కరణలు చేపట్టనున్నట్టు తెలిపారు. కార్మిక చట్టాల్లో సంస్కరణలను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సంస్కరణలకు వ్యతిరేకంగా డిసెంబర్ 5న దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement