షర్ట్ విప్పేసి మహిళ నిరసన.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శివారున గ్రేటర్ నోయిడా సహా పలు ప్రాంతాలలో ఆఫ్రికా వాసులపై జరిగిన జాతి వివక్ష దాడులు ఇటీవల వెలుగు చూశాయి. తాజాగా ఢిల్లీ మెట్రో రైలులో ఓ ఆఫ్రికన్ మహిళ షర్ట్ విప్పేసి తనతో గొడవపడిన వారిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇద్దరు ఆఫ్రికన్ మహిళలు మెట్రో రైలులో వెళ్తుండగా తోటి ప్రయాణికులు వారితో వాదనకు దిగారు. రైలులో మహిళల కంటే యువకులే ఎక్కువగా ఉన్నారు. మహిళలు ఇద్దరూ వారితో వాగ్వాదానికి దిగారు. కాసేపటి తర్వాత ఒకామె మరో మహిళను సీటులో కూర్చోబెట్టింది. తర్వాత కూడా మహిళలకు, యువకులకు మధ్య గొడవ జరుగుతూనే ఉంది. వీరిద్దరినీ బయటకు తోసేయండి అంటూ కొందరు అరిచారు.
ఇంతలో ఓ మహిళ తన షర్ట్ విప్పేసి కొట్లాటకు రండి అంటూ యువకులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. కొందరు జోక్యం చేసుకుని మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం తతంగాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సీట్ల విషయంపై మహిళలకు, యువకులకు మధ్య వాదులాట జరిగినట్టు సమాచారం.