![Mahesh Babu Shares His GYM Video Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/21/mahesh.jpg.webp?itok=VDme5D5J)
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తెలుగులోనే కాక చలనచిత్ర పరిశ్రమల్లో ఆయన గ్లామర్, ఫిట్‌నెస్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. నాలుగు పదుల వయసు వచ్చినప్పటికి కూడా మహేశ్ పాతికేళ్ల కూర్రాడిలాగే కనిపిస్తున్నాడు. అంటే అంతలా ఆయన ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహేశ్తా జాగా తన జిమ్ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో మహేశ్ ‘బాక్స్ జంప్స్’ చేస్తూ కనిపించాడు. ఇక ఇది చూసి సూపర్ స్టార్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: మహేశ్ బాబు అందానికి సీక్రెట్ అదే : విష్ణు)
కాగా మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహేశ్ మీసాలు లేకుండా, కాస్త జులుపాల జుట్టుతో కనిపించనున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కునున్న ఈ మూవీలో మహేశ్ సరసన కీర్తి సురేష్ తొలిసారిగా జత కడుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు. (చదవండి: ఇక ఎక్కువ సమయం తనతోనే గడిపేస్తా : పూజా హెగ్డే)
Comments
Please login to add a commentAdd a comment