ఆ అమ్మాయి కనిపిస్తే దయచేసి నాకు చెప్పండి.. రాజ్ తరుణ్ వీడియో వైరల్ | Young Hero Raj Tarun Shares A Video In Socila Media Goes Viral | Sakshi
Sakshi News home page

Rajtarun: అమ్మాయిలు నా జీవితానికి హానికరం.. రాజ్‌ తరుణ్ వీడియో వైరల్

Oct 30 2022 1:39 PM | Updated on Oct 30 2022 1:53 PM

Young Hero Raj Tarun Shares A Video In Socila Media Goes Viral - Sakshi

సినిమాలతో బిజీగా ఉండే టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌ తరుణ్ అకస్మాత్తుగా సోషల్ మీడియాలో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ‘స్టాండప్‌ రాహుల్‌’  ఫ్లాప్‌ తర్వాత సోషల్‌మీడియాకు దూరంగా ఉంటున్న నటుడు ఓ వీడియోలో అమ్మాయికి వార్నింగ్ ఇస్తూ చాలా ఆగ్రహంతో కనిపించారు. చాలా రోజులుగా సైలెంట్‌గా ఉన్న హీరో సడన్‌ షాక్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ ఆ వీడియో ఏముంది? అతను ఎందుకు అంతగా సీరియస్‌గా ఉన్నారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.  రాజ్ తరుణ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఆనందాలు, అమ్మాయిలు నా జీవితానికి హానికరం. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి' అనే క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. 

(చదవండి: వాళ్లని తప్పా నేను ఎవరిని మోసం చేయలేదు : పూరి జగన్నాథ్‌)

 ఆ వీడియోలోరాజ్ తరుణ్ మాట్లాడుతూ..' హాలో అండి. నేను సడన్‌గా ఈ వీడియో పెట్టడానికి ఓ కారణం ఉంది. మీకోక అమ్మాయి గురించి చెప్పాలి. అసలు నా జీవితంలో అమ్మాయి టాపిక్ వస్తుందని ఎప్పుడూ అనుకోలా. చిన్నప్పటి నుంచి నా ‍ఫ్రెండ్స్ అందరూ అమ్మాయిలతో తిరుగుతుంటే.. నేను కొత్తిమీర, కరివేపాకు అంటూ తిరిగేవాణ్ని. మా ఫ్రెండ్స్‌ను చూస్తే అసూయ. అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం. దీంతో నా జీవితానికి ప్రేమ సెట్‌ కాదని అర్థమైపోయింది. సిన్సియర్‌గా  నాకు పెళ్లి చేయమని అమ్మానాన్నను అడిగా. మొదట వాళ్లు కంగారు పడ్డారు. దాంతో నాకు మంచి సంబంధం చూశారు. ఇంకేముంది పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి సెట్, మండపం సెట్, బంధువులంతా వచ్చారు. గంగిరెద్దులా మండపంలో కూర్చోబెట్టారు. పంతులు అమ్మాయిని తీసుకురండి అనే సరికి షాక్. ఇంకేముంది తీరా చూస్తే అమ్మాయి జంప్‌. వాళ్ల చెల్లి ఓ లెటర్ తీసుకొచ్చింది. ఇక అ‍ప్పుడు మొదలైంది చుట్టాల సానుభూతి. ఒసేయ్‌.. నువ్వు ఎక్కడ ఉన్నా పట్టుకుంటా? నీ అంతు చూస్తా? రేపే నీ ఫొటో ఆన్‌లైన్‌లో పెడతా. ఆమె కనపడితే దయచేసి ఎవరైనా నాకు చెప్పండి' అంటూ వీడియోలో మాట్లాడారు.

అయితే ఇదంతా చూస్తుంటే కేవలం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే చేసినట్లు కనిపిస్తోంది. తన రాబోయే చిత్రాన్ని ప్రకటించడం కోసమే ఆయన ఈ వీడియో షేర్‌ చేశారని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. మరి రాజ్‌ తరుణ్‌ ఫ్యాన్స్‌కు ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో వేచి చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement