
యాంకర్ రవి..బుల్లితెరపై టాప్ యాంకర్‌గా అలరిస్తున్నాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తాడు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో గడిపేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటూ రవి పలుసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. తన గారాల పట్టి వియా అంటూ చెప్పలేనంత ప్రేమ అని తనకోసం ఏదైనా చేస్తానంటున్నాడు రవి. తాజాగా కూతురు అడిగిందని వెంటనే తనకోసం స్పెషల్‌గా చికెన్ చేసి తినిపించాడు. అంతేకాకుండా తన చిట్టితల్లికి కారం తగలొద్దని జాగ్రత్తలు తీసుకొని మరీ వంట చేశాడట. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
కూతురిపై రవి కురిపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరోవైపు..మీరు చేసే వీడియోలు చూసి మా భార్యలు మమ్మల్ని కూడా వంట చేయమని డిమాండ్ చేస్తున్నారంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక రియాలిటీ షోలతో బిజీగా ఉంటున్న రవి...బిగ్‌బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇస్తున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకు మందు సీజన్లలోనూ బిగ్‌బాస్ టీం తనను సంప్రదించిందని, అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అప్పుడు వెళ్లలేదని గతంలో రవి పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి ఈ సీజన్‌లో అయినా అడుగుపెడతాడా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.
చదవండి : (చిరంజీవి చేతుల మీదుగా 'విరాటపర్వం')
(లాస్యకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి)
Comments
Please login to add a commentAdd a comment