‘ఏవమ్ జగత్’ సాంగ్‌ విడుదల చేసిన 'వకీల్ సాబ్' ఫేమ్ అనన్య | Ananya Nagalla Released Evam Movie Song | Sakshi
Sakshi News home page

Evam Jagath: ‘ఏవమ్ జగత్’ సాంగ్‌ విడుదల చేసిన 'వకీల్ సాబ్' ఫేమ్ అనన్య

Sep 15 2021 6:42 PM | Updated on Sep 15 2021 7:03 PM

Ananya Nagalla Released Evam Movie Song - Sakshi

కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేశం, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఏవం జగత్’. దినేష్ నర్రా దర్శకుడు. మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు.ఎన్, రాజేశ్వరి.ఎన్ నిర్మిస్తున్నారు.  ఈ  సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని ‘రాధాస్ లవ్’ సాంగ్ ని 'వకీల్ సాబ్' ఫేమ్ అనన్య నాగళ్ల విడుదల చేసింది. శివ కుమార్ మ్యూజిక్ అందించగా సందీప్ కూరపాటి, సమీరా భరద్వాజ్ పాడారు. పాటను విడుదల చేసిన అనన్య చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది.

ఈ సందర్భంగా దర్శకుడు దినేష్ నర్రా మాట్లాడుతూ.. ‘వ్యవసాయం భవిష్యత్తు ఏంటి..? రాబోయే తరానికి కావాల్సిన ఆహార అవసరాలు తీర్చేంతా సాగు భూమి కానీ, పండించే అనుభవం కానీ మన దేశ యువతకి ఉందా..? అనే అంశాలను ప్రధానంగా 'ఏవం జగత్' మూవీలో చూపిస్తున్నాం. వ్యవసాయం, మానవ సంబంధాలతో ముడిపడిన అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ఓ 20 ఏళ్ల యువకుడి కథే మా సినిమా’ అని తెలిపారు. కాగా త్వరలోనే సినిమాని విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement