నాకోసం మారావా నువ్వూ! | New Song On Naga Chaitanya Released From Bangarraju Movie | Sakshi
Sakshi News home page

నాకోసం మారావా నువ్వూ!

Published Mon, Dec 6 2021 2:10 AM | Last Updated on Mon, Dec 6 2021 2:10 AM

New Song On Naga Chaitanya Released From Bangarraju Movie - Sakshi

‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్‌ తర్వాత నాగార్జున హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’ అన్నది ఉపశీర్షిక. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్యకి జోడీగా కృతీశెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నాకోసం మారావా నువ్వూ, లేక నన్నే మార్చేశావా నువ్వూ..’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను ఆదివారం విడుదల చేశారు.

ప్రేయసి కృతీశెట్టి కోసం నాగచైతన్య ఎంతలా తనని తాను మార్చుకున్నాడో ఈ పాటలో చెప్పారు. బాలాజీ రచించిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ పాడగా, అనూప్‌ రూబెన్స్‌ మంచి మెలోడీ ట్యూన్‌ను అందించారు. ‘నా కోసం..’ పాటకి  మంచి స్పందన వస్తోంది’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. జీ స్టూడియోస్‌ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement