ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం మంత్రులకు శాఖలు కేటాయిం చారు. ఈ నెల 8న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా, ఆయనతో పాటు 19 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. వారికి ఈ రోజు శాఖలు కేటాయించారు.
నారా చంద్రబాబు నాయుడు : ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, న్యాయ, ఇంధన,
మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖలతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
కేఈ కృష్ణమూర్తి: ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు
నిమ్మకాయల చినరాజప్ప: ఉప ముఖ్యమంత్రి, హోం మరియు విపత్తుల నివారణ
యనమల రామకృష్ణుడు: ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాలు
సీహెచ్. అయ్యన్నపాత్రుడు: పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి: అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక, సహకార
దేవినేని ఉమామహేశ్వరరావు : నీటి పారుదల, పరీవాహక ప్రాంత అభివృద్ధి మరియు జలవనరుల నిర్వహణ
పి. నారాయణ: మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, పట్టణ నీటి సరఫరా, పట్టణ ప్రణాళిక
పరిటాల సునీత: పౌర సరఫరాలు, ధరల నియంత్రణ, వినియోగదారుల వ్యవహారాలు
ప్రత్తిపాటి పుల్లారావు: వ్యవసాయం, మార్కెటింగ్, గిడ్డంగులు, పశుసంవర్థక, మత్స్య శాఖ
కామినేని శ్రీనివాస్: వైద్య, ఆరోగ్యం, వైద్య విద్య
గంటా శ్రీనివాసరావు: మానవ వనరుల అభివృద్ధి (ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, సాంకేతిక విద్య)
పల్లె రఘునాథరెడ్డి: సమాచార పౌరసంబంధాలు, తెలుగు భాష మరియు సంస్కృతి, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు, మైనార్టీ సంక్షేమం, ఐటీ
పీతల సుజాత: భూగర్భ గనులు, మహిళా శిశు సంక్షేమం, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం
కింజరపు అచ్చెన్నాయుడు: కార్మిక ఉపాధి, యువత క్రీడలు, స్కిల్ డెవలప్‌మెంట్
సిద్ధా రాఘవరావు: రవాణా, రోడ్లు, భవనాలు
కిమిడి మృణాళిని : గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, పరిసరాల పరిశుభ్రత
కొల్లు రవీంద్ర: బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్
రావెళ్ల కిశోర్‌బాబు: సాంఘిక సంక్షేమం, సాధికారత, గిరిజన సంక్షేమం
పైడికొండల మాణిక్యాలరావు: దేవాదాయ శాఖ
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు
Published Thu, Jun 12 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM
Advertisement
Advertisement