
8న రాత్రి చంద్రబాబు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జూన్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయం మారింది. ముందుగా అనుకున్నట్లుగా మధ్యాహ్నం 11.45 గంటలకు కాకుండా రాత్రి 7.30కు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం రాత్రి వేదపండితుడు పొన్నలూరి శ్రీనివాసగార్గేయతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిదిన రాత్రి ఎనిమిదిన్నరకు రైతుల రుణ మాఫీ ఫైలుపై చంద్రబాబు తొలి సంతకం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
గుంటూరు, విజయవాడ మధ్యే రాజధాని: మోదుగుల
గుంటూరు, విజయవాడ మధ్యనే సీమాంధ్ర రాజధాని ఉంటుందని, అందువల్లే చంద్రబాబు ఆ ప్రదేశంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారని గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మీడియాకు చెప్పారు. అయితే పార్టీ వర్గాలు మాత్రం కృష్ణా జిల్లా బాపులపాడు, ఆగిరిపల్లి ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తారని చెబుతున్నాయి.