‘చంద్రబాబు బూటకపు హామీలతో గద్దెనెక్కాడు.
కుతంత్రాలు పూని కుప్పలుతెప్పలుగా దాచుకున్న ధనంతో ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఇతనికి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హతలేదు. అవినీతి కుంభకోణానికి బాధ్యత వహిస్తూ చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలి’ చంద్రబాబుపై సామాన్యులు వ్యక్తం చేసిన
అభిప్రాయాలు వారి మాటల్లోనే..
- ఏలూరు (వన్ టౌన్)
తక్షణమే రాజీనామా చేయాలి
పదవుల కోసం నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనాలనుకోవడం హేయం. బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉంటూ ఇలాంటి అవినీతి రాజకీయూలకు పాల్పడం తగదు. జరిగిన అవినీతి భాగోతానికి బాధ్యత వహిస్తూ తక్షణమే సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయూలి.
- మున్నుల జాన్‌గురునాథ్, ఏలూరు
శిక్ష పడాల్సిందే
ఓటును సంక్షేమ పాలనతో సాధించుకోవాలి కాని అడ్డదారిలో ఎమ్మెల్యేలను కొనాలనుకోవడం అవినీతి చర్య. అవినీతిని అంతం చేయాల్సిన ముఖ్యమంత్రే అక్రమాలకు పాల్పడటం మామూలు విషయం కాదు. ఇటువంటి నాయకులకు శిక్ష పడాల్సిందే.
- చిట్టి కనకమహాలక్ష్మి, నిరుద్యోగి, ఏలూరు.
న్యాయ నిపుణులు స్పందించాలి
సీఎం చంద్రబాబు అవినీతి భాగోతంపై న్యాయనిపుణులు స్పందించాలి. ఆధారాలతో ఏసీబీకి అడ్డంగా దొరికిన అతడిని అరెస్ట్ చేయూలి. ముందు సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయూలి. అందరూ దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది.
- వేగి చిన్ని ప్రసాద్
మా ఉసురు తగులుతుంది
అబద్దపు హామీలతో గద్దెనెక్కిన సీఎం చంద్రబాబుకు మహిళల ఉసురు తగులుతుంది. ఓటుకు నోటును అంతం చేయూల్సిన వారే కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొనాలనుకోవడం దారుణం. అవినీతిపరులు కటకటాలు లెక్కపెట్టాల్సిందే.
- వి.లక్ష్మి, గృహిణి, ఏలూరు
అవినీతికి కోట్లు వెచ్చిస్తారా..!
కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేను కొనడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు. సంక్షేమ పాలనతో ప్రజల మన్ననలు పొందాల్సిన నాయకుడు డబ్బుతో ప్రజాప్రతినిధులను కొనాలనుకోవడం ఎంతవరకు సమంజసం. తక్షణమే అతడిని అరెస్ట్ చేసి న్యాయవిచారణ చేయూలి.
- కంటిపూడి జ్యోతి, కూలీ, ఏలూరు
ఇంత డబ్బు ఎక్కడిది
చంద్రబాబు చాపకింద నీరులా అవినీతి సాగిస్తే ఎవరికీ తెలియదనుకోవడం పొరపాటు. అవినీతి ఎప్పటికైనా బయటపడుతుంది. ఇచ్చిన హామీలు అమలుచేయడానికి లేని డబ్బులు ఎమ్మెల్యేలను కొనడానికి ఎలా వచ్చాయి. చంద్రబాబును అరెస్ట్ చేయూలి.
- మేడిపల్లి ప్రశాంతి, కూలీ, ఏలూరు.
కేసు పెట్టాలి
అవినీతి పరులు ప్రజలు, అధికారులు కళ్లుగప్పి తిరగొచ్చేమో.. ఎంతటివారైనా దేవుని దృష్టి నుంచి తప్పించుకోలేరు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడాలి. అవినీతిని పారద్రోలాలి. ఇంతటి పనికి పాల్పడిన చంద్రబాబుపై కేసు పెట్టాలి.
- వేశిపోడి మేరి, గృహిణి, ఏలూరు.
ఇది దారుణం
ప్రజలకు ఖర్చుపెట్టేందుకు రూపాయి లేదు అప్పుల్లో ఉన్నాం అంటున్న చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనడానికి ఇంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో చెప్పాలి. సీఎం అంతటి వ్యక్తే ఇంతటి దారుణానికి ఒడిగడితే ప్రజలను కాపాడేదెవరు.
- షేక్ హసీనా, ఇంటిపని, ఏలూరు
బాబును జైలులో పెట్టాలి
బూటకపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనాలని చూడటం దారుణమైన చర్య. తక్షణమే బాబును అరెస్ట్ చేయూలి. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మాం. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు.
- కోటా గాంధీ, నిరుద్యోగి, ఏలూరు
ఇదేం పని బాబూ!
Published Tue, Jun 9 2015 1:49 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement