
లండన్: సెల్‌ఫోన్ చోరీకి గురైందంటూ దశాబ్దం క్రితం తప్పుడు ఫిర్యాదు చేసిన కేసులో యూకే రవాణా శాఖ మంత్రి లూయీజ్ హే(37) శుక్రవారం పదవికి రాజీనామా చేశారు. 2013లో లూయాజ్‌ను గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు. తను పోగొట్టుకున్న వాటిలో సెల్‌ఫోన్ కూడా ఉందంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె సెల్‌ఫోన్ దొరికింది. దీనిపై పోలీసుల విచారణలో ఆమె..దోపిడీకి గురైనవాటిలో మొబైల్ ఉందంటూ పొరపాటున ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
కోర్టులో కూడా ఆమె తన తప్పిదాన్ని అంగీకరించారు. మొదటి తప్పుగా భావించి కోర్టు ఆమెను విడుదల చేసింది. రవాణా మంత్రి లూయీజ్ ఫ్రాడ్ చేసినట్లుగా మీడియాలో వార్తలు రావడంతో లాయర్ సలహా మేరకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాజా పరిస్థితుల్లో రాజీనామా చేయడమే ఉత్తమమని భావిస్తున్నానని, ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు కొనసాగిస్తానని ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌కు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఎంపీగా షెఫీల్డ్ నుంచి లూయీజ్ హే ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment