cellphone theft
-
సెల్‌ఫోన్ ఫ్రాడ్ కేసులో బ్రిటన్ మంత్రి రాజీనామా
లండన్: సెల్‌ఫోన్ చోరీకి గురైందంటూ దశాబ్దం క్రితం తప్పుడు ఫిర్యాదు చేసిన కేసులో యూకే రవాణా శాఖ మంత్రి లూయీజ్ హే(37) శుక్రవారం పదవికి రాజీనామా చేశారు. 2013లో లూయాజ్ను గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు. తను పోగొట్టుకున్న వాటిలో సెల్‌ఫోన్ కూడా ఉందంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె సెల్‌ఫోన్ దొరికింది. దీనిపై పోలీసుల విచారణలో ఆమె..దోపిడీకి గురైనవాటిలో మొబైల్ ఉందంటూ పొరపాటున ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కోర్టులో కూడా ఆమె తన తప్పిదాన్ని అంగీకరించారు. మొదటి తప్పుగా భావించి కోర్టు ఆమెను విడుదల చేసింది. రవాణా మంత్రి లూయీజ్ ఫ్రాడ్ చేసినట్లుగా మీడియాలో వార్తలు రావడంతో లాయర్ సలహా మేరకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాజా పరిస్థితుల్లో రాజీనామా చేయడమే ఉత్తమమని భావిస్తున్నానని, ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు కొనసాగిస్తానని ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌కు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఎంపీగా షెఫీల్డ్ నుంచి లూయీజ్ హే ఎన్నికయ్యారు. -
‘ సెల్ ఫోన్’ ముఠా ఆట కట్టు
చిత్తూరు అర్బన్ : రద్దీగా ఉన్న బస్సులు, సినిమా థియేటర్లు, ఆలయాల్లాంటి ప్రాంతాల్లో సెల్ఫోన్లు చోరీ చేసే ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.75 లక్షలు విలువచేసే 506 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం చిత్తూరు పోలీసు అతిథిగృహంలో ఎస్పీ సెంథిల్‌కుమార్, ఏఎస్పీ మహేష్, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఆరు నెలలుగా పలు పోలీస్ స్టేషన్లలో సెల్ఫోన్లు కనిపించడంలేదనే ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ సెంథిల్‌కుమార్.. పోలీసు విభాగంలోని టెక్నికల్ అనాలసిస్ బృందాన్ని రంగంలోకి దింపారు. మొబైల్ ఫోన్ల ఐఎంఈ నంబర్ల ఆధారంగా ఆ ఫోన్లను గుర్తించారు. దీనికి సంబంధించి చిత్తూరు నగరంతో పాటు కర్నూలు జిల్లా దోన్కు చెందిన 17 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, వీరిలో నలుగురు మైనర్లుండటం గమనార్హం. వీరి నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకుని, పోగొట్టుకున్న బాధితులకు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన కొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
అంతర్రాష్ట్ర సెల్ఫోన్ల చోరీ ముఠాలో ఇద్దరి అరెస్ట్
గూడూరు: కూలి పనులు చేసుకుంటున్నట్టు నమ్మించి చెన్నై వంటి రద్దీగా ఉన్న ప్రదేశాల్లో విలువైన సెల్ ఫోన్లను దొంగిలించి సొమ్ము చేసుకుంటున్న ముఠాలోని ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.23.63 లక్షల విలువైన సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు గూడూరులోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన మేకల సుబ్బారావు కుమారుడు కృష్ణ, అదే ప్రాంతానికి చెందిన మేకల మురళీ కుమారుడు పవన్‌లు.. మరో ఇద్దరితో కలిసి 45 రోజుల కిందట చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తాము కూలి పనులు చేసుకుంటామని స్థానికులను నమ్మించి ఓగదిని అద్దెకు తీసుకున్నారు. వారంతా కలిసి పగటి వేళల్లో బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో జేబులు కొట్టడంతో పాటు సెల్ఫోన్లు చోరీ చేస్తుండేవారు. అలా దొంగిలించిన సెల్ఫోన్లను స్నేహితుడి సాయంతో సాఫ్ట్‌వేర్‌ను ఫార్మెట్ చేసి విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్ఐ బ్రహ్మనాయుడు తదితరులు జాతీయ రహదారిపై పోటుపాళెం కూడలి ప్రాంతం వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్సు దిగి అనుమానాస్పదంగా బ్యాగులు పట్టుకుని తిరుగుతున్న కృష్ణ, పవన్‌లను వారు గమనించారు. అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి నేర చరిత్రతో పాటు వారి వద్ద ఉన్న బ్యాగుల్లో 228 సెల్ఫోన్లు బయటపడ్డాయి. కృష్ణపై పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కేసులుండగా, ఆకివీడు పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. -
బాల బాబా.. చేతులపై నిప్పులు పోశాడు!!
-
అమ్మాయిల చేతుల్లో నిప్పులు పోసిన 'బాబీ బాబా'
మెదక్ జిల్లాలో ఓ విద్యార్థి బాబా అవతారం ఎత్తి.. విద్యార్థుల చేతిలో నిప్పులు పోశాడు. దాంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మెదక్ జిల్లా నరసాపూర్ మండలం పెద్దచింతకుంట సమీపంలోని సీతారాం తండాలో అల్లూరి సీతారామరాజు గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వినోద్ అనే విద్యార్థి సెల్‌ఫోన్ ఇటీవల పోయింది. దాంతో.. అతడు 'బాబీ బాబా'ను ఆశ్రయించాడు. సదరు బాబీ బాబా ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. వారానికోసారి బాబా అవతారం ఎత్తుతాడు. వినోద్‌ను ఎవరిమీదైనా అనుమానం ఉందా అని బాబీ బాబా అడిగితే.. ఐదుగురు విద్యార్థుల పేర్లు చెప్పాడు. దాంతో వాళ్లను తీసుకురమ్మని చెప్పగా.. తీసుకెళ్లాడు. వెంటనే బాబీ బాబా వాళ్ల చేతుల్లో నిప్పులు పోసి ఎవరి చేతులు కాలితే వాళ్లే దొంగలన్నట్లుగా అగ్నిపరీక్ష పెట్టాడు. ఐదుగురికి చేతులు కాలడంతో వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.