స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లతో ఎస్పీ సెంథిల్ కుమార్ తదితరులు
చిత్తూరు అర్బన్ : రద్దీగా ఉన్న బస్సులు, సినిమా థియేటర్లు, ఆలయాల్లాంటి ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు చోరీ చేసే ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.75 లక్షలు విలువచేసే 506 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం చిత్తూరు పోలీసు అతిథిగృహంలో ఎస్పీ సెంథిల్‌కుమార్, ఏఎస్పీ మహేష్, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఆరు నెలలుగా పలు పోలీస్ స్టేషన్లలో సెల్‌ఫోన్లు కనిపించడంలేదనే ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ సెంథిల్‌కుమార్.. పోలీసు విభాగంలోని టెక్నికల్ అనాలసిస్ బృందాన్ని రంగంలోకి దింపారు.
మొబైల్ ఫోన్ల ఐఎంఈ నంబర్ల ఆధారంగా ఆ ఫోన్లను గుర్తించారు. దీనికి సంబంధించి చిత్తూరు నగరంతో పాటు కర్నూలు జిల్లా దోన్‌కు చెందిన 17 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, వీరిలో నలుగురు మైనర్లుండటం గమనార్హం. వీరి నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకుని, పోగొట్టుకున్న బాధితులకు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన కొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment