Senthilkumar
-
‘ సెల్ ఫోన్’ ముఠా ఆట కట్టు
చిత్తూరు అర్బన్ : రద్దీగా ఉన్న బస్సులు, సినిమా థియేటర్లు, ఆలయాల్లాంటి ప్రాంతాల్లో సెల్ఫోన్లు చోరీ చేసే ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.75 లక్షలు విలువచేసే 506 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం చిత్తూరు పోలీసు అతిథిగృహంలో ఎస్పీ సెంథిల్‌కుమార్, ఏఎస్పీ మహేష్, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఆరు నెలలుగా పలు పోలీస్ స్టేషన్లలో సెల్ఫోన్లు కనిపించడంలేదనే ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ సెంథిల్‌కుమార్.. పోలీసు విభాగంలోని టెక్నికల్ అనాలసిస్ బృందాన్ని రంగంలోకి దింపారు. మొబైల్ ఫోన్ల ఐఎంఈ నంబర్ల ఆధారంగా ఆ ఫోన్లను గుర్తించారు. దీనికి సంబంధించి చిత్తూరు నగరంతో పాటు కర్నూలు జిల్లా దోన్కు చెందిన 17 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, వీరిలో నలుగురు మైనర్లుండటం గమనార్హం. వీరి నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకుని, పోగొట్టుకున్న బాధితులకు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన కొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
పుత్తూరు రూరల్(చిత్తూరు జిల్లా): అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన నలుగురు నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.45 లక్షలు విలువ చేసే బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను పుత్తూరు డీఎస్పీ టీడీ యశ్వంత్ శనివారం మీడియాకు వెల్లడించారు. పుత్తూరు డివిజన్ పరిధిలోని దొంగతనాలను అరికట్టేందుకు, నిందితులను పట్టుకునేందుకు నెల రోజులుగా 30 మందితో కూడిన 4 బృందాలు తమిళనాడు, ఏపీ సరిహద్దుల్లో విసృతంగా గాలించాయని చెప్పారు. ఈ నెల 14న నారాయణవనం మండలం పాలమంగళం బస్టాప్ వద్ద పుత్తూరు రూరల్ సీఐ, నారాయణవనం, ఎస్ఆర్పురం, వరదయ్యపాళెం ఎస్ఐలతో కూడిన బృందం తమిళనాడుకు చెందిన నలుగురు గజ దొంగలను పట్టుకుందని చెప్పారు. వీరిలో రాయపురానికి చెందిన ఆర్.రవి అలియాస్ రవిశంకర్.. ప్రస్తుతం ఏపీలోని పిచ్చాటూరు మండలం కొత్తగొల్లకండ్రిగలో నివాసం ఉంటున్నారని తెలిపారు. మిగిలిన ముగ్గురు కె.భాస్కర్, ఎ.మణి, ఎం.సేతు ధర్మపురం జిల్లా ఆరూరుకు చెందిన వారని పేర్కొన్నారు. వీరిని విచారించగా సత్యవేడు, వరదయ్యపాళెం, నాగలాపురం, పిచ్చాటూరు, నారాయణవనం, పుత్తూరు, ఎస్ఆర్ పురం, కార్వేటి నగరం, వెదురుకుప్పం పోలీస్స్టేషన్ల పరిధిలోని ఇళ్లల్లో దొంగతనాలు చేశామని అంగీకరించినట్లు తెలిపారు. ఈ కేసులను ఛేదించిన పుత్తూరు, నగరి రూరల్ సీఐలు ఎం.సురేష్‌కుమార్, ఎం.రాజశేఖర్, సీఐ చంద్రశేఖర్‌నాయక్, ఎస్ఐలు ఎం.ప్రియాంక, ఎన్.శ్రీకాంత్‌రెడ్డి, ఎం.నాగార్జునరెడ్డి, పురుషోత్తంరెడ్డి, ఇతర సిబ్బందిని ఎస్పీ సెంథిల్‌కుమార్ అభినందించారని డీఎస్పీ తెలిపారు. -
దర్గా దగ్ధం దొంగల పనే
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా నాగిరెడ్డిపల్లిలోని దర్గా దగ్ధం ఘటన దొంగల పనేనని, దీనివెనుక ఎటువంటి మత విద్వేషాలకు తావు లేదని దర్గా నిర్వాహకుడు జిలానీ బాషా స్పష్టం చేశారు. ఈ ఘటనను పురస్కరించుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో ఆలయాలకు రక్షణ లేదని, దర్గాలనూ వదలడం లేదని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జిలానీ బాషా సెల్ఫీ వీడియో ద్వారా గట్టి బదులిచ్చినట్టయ్యింది. ఈ ఘటనపై జిలానీ ఆ వీడియోలో ఏమన్నారంటే.. ‘నా పేరు జిలానీ బాషా. మా నాన్న పేరు అల్లాబక్షు. 30 ఏళ్ల క్రితం మా నాన్న ఒక దర్గా నిర్మించారు. అప్పటినుంచి అక్కడ హిందూ ముస్లింలు ఎటువంటి మత విభేదాలకు తావు లేకుండా మత సామరస్యంతో సద్భావంతో ఉరుసు ఉత్సవం జరుపుకుంటున్నారు. ఇక్కడి ప్రజలంతా మత సామరస్యం కలిగినవారే. విలువైన వస్తువులు, హుండీలోని డబ్బుల కోసం ఈ నెల 16 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి దర్గాలోకి ప్రవేశించారు. ఎటువంటి విలువైన వస్తువులు దొరక్కపోవడంతో కోపంతో అక్కడ ఉన్న పాత చద్దర్లను తగులబెట్టారు. దీనిపై నేను గంగవరం పీఎస్‌లో ఫిర్యాదు చేశాను. దీనికి బాధ్యులైన వారిని పోలీసులు తొందర్లోనే పట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఎలాంటి మత విభేదాలూ లేవని మరొక్కసారి చెబుతున్నాను’ అని స్పష్టం చేశారు. మూడు ప్రత్యేక బృందాల ఏర్పాటు నాగిరెడ్డిపల్లి దర్గా ఘటనకు కారణమైన నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చిత్తూరు జిల్లా ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ సోమవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 16వ తేదీన రాత్రి జిలానీ బాబా దర్గాలోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి దర్గాలోని మజార్‌పై నుంచి తీసేసిన చద్దర్లను, కొన్ని పాత వస్తువులు కాల్చారన్నారు. దర్గా నిర్వాహకుడు జిలాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇటువంటి సమయాల్లో ప్రజలు సంయమనం పాటించాలని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజానిజాలను ప్రభుత్వ వెబ్సైట్ factcheck.ap.gov.in ద్వారా తెలుసుకోవాలని సూచించారు. ప్రార్థనా స్థలాలు, ఆలయాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కన్పించినా, విద్రోహ చర్యలకు పాల్పడే ప్రయత్నం చేసినా అటువంటి వారి సమాచారాన్ని డయల్ 100కు గానీ, పోలీస్ వాట్సాప్ నంబర్ 94409 00005కు గాని తెలియజేయాలని ఎస్పీ కోరారు. -
రాజమౌళి చాలెంజ్ స్వీకరించారు
ఇటీవలే రామ్‌చరణ్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న సంగతి తెలిసిందే. మొక్కలు నాటి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందాన్ని కూడా మొక్కలు నాటమంటూ ఈ చాలెంజ్‌కు ఎంపిక చేశారు. చరణ్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం మొక్కలను నాటారు. దర్శకులు రాజమౌళి, కెమెరామేన్ సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, దర్శకత్వ శాఖ ఇలా అందరూ మొక్కలు నాటుతున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లమంటూ ‘ఆచార్య, రాధేశ్యామ్, పుష్ప’ చిత్రబృందాలను ఎంపిక చేసింది ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్. దర్శకులు రామ్‌గోపాల్ వర్మ, వీవీ వినాయక్, పూరి జగన్నాథ్‌లను గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు ఎంపిక చేశారు రాజమౌళి. మీకో దండం రాజమౌళి విసిరిన ఈ చాలెంజ్‌కు ట్విట్టర్లో సరదాగా కామెంట్ చేశారు రామ్‌గోపాల్ వర్మ. ‘రాజమౌళిగారూ.. నేను చాలెంజ్‌లు, పచ్చదనం వంటి విషయాల మీద పెద్దగా ఆసక్తి లేనివాణ్ణి. అలాగే చేతికి మట్టి అంటుకుంటే మహా చిరాకు నాకు. నాలాంటి స్వార్థపరుడు మొక్కలు నాటడం కంటే వేరెవరైనా ఆ పని చేయడం మంచిదని నా అభిప్రాయం. మీకూ మీ మొక్కలకూ ఓ దండం’ అని ట్వీట్ చేశారు వర్మ. -
ఆర్ఆర్ఆర్ అప్డేట్
టాలీవుడ్ యంగ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటిస్తోన్న మొదటి చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నీ కుదిరి ఉంటే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో షూటింగ్‌లకు బ్రేక్ పడింది. దీంతో ఆర్ఆర్ఆర్కు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కొన్నివివరాలు చెప్పారు. మూవీ షూటింగ్ ఇప్పటికే 70శాతం పూర్తి అయ్యిందని ఆయన తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ‘మార్చిలో లాక్డౌన్ ప్రకటించే సమయానికి ఆర్ఆర్ఆర్కి సంబంధించిన 70శాతం ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. షూటింగ్ అయినంత వరకు ఎడిటింగ్ పనులు కూడా ఎప్పటికప్పుడు జరిగాయి. ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌కు డబ్బింగ్ కూడా పూర్తి అయ్యింది’ అని సెంథిల్ వెల్లడించారు. జూలైలో షూటింగ్స్‌కు పర్మిషన్ ఇచ్చినప్పుడే సెట్స్ మీదకు వెళ్లాలనుకున్నప్పటికీ, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో షూటింగ్‌ను ప్రారంభించలేదని ఆయన చెప్పారు. ఒకటి లేదా రెండు నెలల్లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు ఆయన వివరించారు. అనుకున్న సమయానికే సినిమా విడుదల అవుతుంది అని ఆయన చెప్పారు. చదవండి: ఆర్ఆర్ఆర్ ఓ అద్భుతం -
‘రఫ్’ కోసం సిక్స్‌ప్యాక్ చేశా!
ఆది ఆల్‌రౌండర్. క్లాస్, మాస్ సినిమాలకు న్యాయం చేయగలం. శక్తి సామర్థ్యాలు అతనిలో ఉన్నాయి. శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అభిలాష్ మాధవరం నిర్మించిన చిత్రమిది. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. సీహెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వం వహించారు. ఎమ్. సుదర్శనరావు సమర్పిస్తున్నారు. ‘‘నా ప్రయాణంలో ‘రఫ్’ సినిమా చాలా చాలా స్పెషల్. నా పెళ్లికి ముందు విడుదలవుతోంది. ఈ సినిమా విజయవంతమైతే నాన్న కళ్లల్లో హ్యాపీనెస్ చూస్తాను. ఆయన ఈ సినిమా గురించి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు’’ అంటున్న హీరో ఆది ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆవిషయాలివీ... భారీ బడ్జెట్! ‘‘నన్ను ఇంకో నాలుగు మెట్లు ఎక్కించే సినిమా ‘రఫ్’. నటుడిగా నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డా. నూటికి నూరుశాతం నా టాలెంట్‌ని ఈ సినిమాలో పెట్టా. అందుకే ‘రఫ్’ గురించి చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. వినోదం, యాక్షన్, లవ్, ఫ్యామిలీ, సెంటిమెంట్స్... ఇలా అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉంటాయి. థియేటర్లోకి అడుగుపెట్టిన ఏ ప్రేక్షకుడూ నిరుత్సాహపడని రీతిలో ఈ కథని తీర్చిదిద్దారు దర్శకుడు సుబ్బారెడ్డి. ఆయనకి ఇదే తొలి చిత్రమైనా... ఎక్కడా అలా అనిపించలేదు. తొలిసారి చేసిన ఒక పక్కా కమర్షియల్ సినిమా కాబట్టి ఈ సినిమా రిజల్ట్ నాకు చాలా చాలా కీలకం. నా కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో తయారైంది. చందు సరదాలు! సినిమాలో నా పాత్ర పేరు చందు. ప్రేమ విషయంలో అతని ఆలోచనా ధోరణి ఎలా ఉంటుంది? నందు అనే అమ్మాయితో తనకి పరిచయం ఎలా ఏర్పడింది? అనే అంశాల్ని స్క్రీన్‌పైనే చూడాలి. చందు పంచే సరదాలు ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటాయి. రకుల్ ప్రీత్‌సింగ్ కూడా చాలా కష్టపడింది. ఆమె అందం సినిమాకు తప్పకుండా ప్లస్ అవుతుంది. ఇటీవల యూత్ రకుల్‌ని చూసేందుకు థియేటర్లకు వస్తున్నారు. ఇందులో ఆమె మరింత అందంగా కనిపించింది. మణిశర్మ, సెంథిల్‌కుమార్ లాంటి టెక్నీషియన్లతో పనిచేయడం ఈ సినిమాతో నాకు దక్కిన మరో గొప్ప అవకాశం అని భావిస్తారు. సిక్స్‌ప్యాక్ ఓ అవసరం! ‘‘అందరూ చేస్తున్నారు, నేనూ చేయాలి అని నేను సిక్స్‌ప్యాక్ బాడీ చేయలేదు. సినిమాకి అది అవసరమైంది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిలో వైవిధ్యం చూపాలంటే సిక్స్‌ప్యాక్ చేయడమే కరెక్ట్ అనిపించింది. దర్శకుడు కూడా అదే చెప్పాడు. దీంతో దాదాపు ఎనిమిది నెలలు కష్టపడి సిక్స్ ప్యాక్ చేశా. దానివల్ల సినిమా కాస్త ఆలస్యమైంది. అయినా సరే ‘ఏం ఫరవాలేదు’ అంటూ నిర్మాత నన్ను ప్రోత్సహించారు. ఒక ఛాలెంజ్‌గా భావించి సిక్స్ ప్యాక్ బాడీని తయారు చేశా. ఇప్పుడు సినిమాల్లో ఆ ట్రెండ్ కూడా నడుస్తుండడం నాకు కలిసొచ్చిందని చెప్పొచ్చు. - ఆది -
ప్రజల చెంతకే పోలీస్
►శాంతిభధ్రతలను పూర్తిస్థాయిలో మెరుగుపరుస్తా ►మహిళల సమస్యలపై ప్రత్యేక దృష్టి ►అక్రమ రవాణాపై ఉక్కుపాదం ►ఎస్పీ సెంథిల్‌కుమార్ 38వ ఎస్పీగా బాధ్యతల స్వీకరణ నెల్లూరు(క్రైమ్) : పోలీసులున్నది ప్రజల కోసమేనని, వారి కోసమే తాము పనిచేస్తున్నామన్న నమ్మకాన్ని అందరిలో కలిగిస్తామని ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ అన్నారు. జనం ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మెరుగైన శాంతిభద్రతలను అందించడంతో పాటు జిల్లాపై అవగాహన పెంపొందించుకుని పోలీసు సేవలను ప్రజలకు చేరువచేస్తామని చెప్పారు. బుధవారం ఉదయం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న ఆయన మొదట సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. 38వ ఎస్పీగా 11 గంటలకు తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజలను గౌరవించడంతో పాటు వారికి న్యాయం చేయడంలో పేద, ధనిక అనే పక్షపాతం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఎర్రచందనం, ఇసుక, సిలికా అక్రమ రవాణాతో పాటు జీరో బిజినెస్‌ను పూర్తిస్థాయిలో నిర్మూలిస్తామన్నారు. నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించి శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో పరిరక్షిస్తామన్నారు. దోపిడీలు, దొంగతనాల నియంత్రణకు పక్కా ప్రణాళికతో ముందుకెళతామన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి కేసుల నమోదు చేస్తామని వివరించారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠి నంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఎస్పీకి ఘనస్వాగతం : సెంథిల్ కుమార్ తన సొంతూరు కోయంబత్తూరు నుంచి భార్య, కుమార్తెతో కలిసి కేరళ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు చేరుకున్నారు. రైల్వేస్టేషన్లో ఆయనకు మూడో నగర ఇన్స్పెక్టర్ కె.వి.రత్నం, ఎస్బీ ఎస్సై శ్రీనివాసులురెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఎస్పీ కుటుంబసభ్యులతో కలిసి పోలీసు అతిథిగృహానికి చేరుకున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, డీఎస్పీలు వీఎస్ రాంబాబు, చంద్రశేఖర్, రామారావు, ఇన్స్పెక్టర్లు మద్ది శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, కె.వి రత్నం, జి. రామారావు, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, జి. మంగారావు, సుధాకర్‌రెడ్డి, బాజీజాన్‌సైదా, బాలసుందరం, వెంకటేశ్వరరావు, నాగేశ్వరమ్మ, ఆర్ఐలు శ్రీనివాసరావు, లక్ష్మణకుమార్, చిరంజీవి, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. ప్రసాదరావు, కార్యదర్శి అంజిబాబు, పోలీసు కార్యాలయ ఏవో రాజశేఖర్, మినిస్టీరియల్ సిబ్బంది తదితరులు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందనలు తెలి పారు. అనంతరం ఎస్పీ పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. -
టీడీపీ నేతలకు భంగపాటు
- ఎస్పీ సెంథిల్‌కుమార్ జిల్లాకు రాక రేపు - 31న బాధ్యతల స్వీకరణ ! నెల్లూరు(క్రైమ్): జిల్లా ఎస్పీగా సెంథిల్‌కుమార్ నియామకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలకు భంగపాటు ఎదురైనట్లు తెలుస్తోంది. సెంథిల్ కుమార్ బుధవారం నెల్లూరుకు రానున్నారు. గురువారం ఆయన ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆయనను నెల్లూరు ఎస్పీగా బదిలీ చేస్తూ ఈ నెల 16న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం బాధ్యతల నుంచి రిలీవ్ అయిన వారు వారం రోజుల్లోపు నియమించిన చోట విధుల్లో చేరాలి. ఈ నెల 21న సెంథిల్‌కుమార్ అనంతపురం ఎస్పీ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. నెల్లూరులో 22న రిలీవ్ అయిన నవదీప్సింగ్గ్రేవాల్ సోమవారం విజయనగరం వెళ్లారు. అయితే సెంథిల్‌కుమార్ బాధ్యతలు చేపట్టే విషయంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆయనకు ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరుంది. అనంతపురంలో ఆయన రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారు. అధికార పార్టీ నేతల సిఫార్సులను కూడా ఖాతరు చేయని అధికారిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఆయన నెల్లూరు ఎస్పీగా నియమితులు కావడంతో జిల్లా టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. అనంతపురం నాయకుల ద్వారా ఎస్పీ గురించి తెలుసుకుని ఆయన నియామకాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే సెంథిల్‌కుమార్ స్థానంలో సూర్యనారాయణరావు పేరు తెరపైకి వచ్చింది. టీడీపీ నేతల ఒత్తిళ్లు ఫలించాయని, సూర్యనారాయణరావు ఎస్పీగా బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగింది. సెంథిల్‌కుమార్ కూడా రిలీవ్ అయిన వారం తర్వాత కూడా బాధ్యతలు చేపట్టకపోవడంతో ఆయన నియామకం ఆగిందని భావించారు. వీటిన్నింటికి ఫుల్స్టాప్ పెడుతూ ఆయన గురువారం బాధ్యతలు చేపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసుశాఖలోని పలువురు అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. విధినిర్వహణలో బాధ్యతారాహిత్యం, అక్రమాలను సెంథిల్‌కుమార్ సహించరనే పేరుండడంతో హడలిపోతున్నారు.