
టాలీవుడ్ యంగ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటిస్తోన్న మొదటి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్(రౌద్రం రణం రుధిరం). రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నీ కుదిరి ఉంటే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో షూటింగ్‌లకు బ్రేక్ పడింది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కొన్నివివరాలు చెప్పారు. మూవీ షూటింగ్ ఇప్పటికే 70శాతం పూర్తి అయ్యిందని ఆయన తెలిపారు.
ఆయన మాట్లాడుతూ, ‘మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించే సమయానికి ఆర్‌ఆర్‌ఆర్‌కి సంబంధించిన 70శాతం ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. షూటింగ్ అయినంత వరకు ఎడిటింగ్ పనులు కూడా ఎప్పటికప్పుడు జరిగాయి. ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌కు డబ్బింగ్ కూడా పూర్తి అయ్యింది’ అని సెంథిల్ వెల్లడించారు. జూలైలో షూటింగ్స్‌కు పర్మిషన్ ఇచ్చినప్పుడే సెట్స్ మీదకు వెళ్లాలనుకున్నప్పటికీ, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో షూటింగ్‌ను ప్రారంభించలేదని ఆయన చెప్పారు. ఒకటి లేదా రెండు నెలల్లో ఆర్ఆర్‌ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు ఆయన వివరించారు. అనుకున్న సమయానికే సినిమా విడుదల అవుతుంది అని ఆయన చెప్పారు.
చదవండి: ఆర్‌ఆర్‌ఆర్ ఓ అద్భుతం
Comments
Please login to add a commentAdd a comment