మెదక్ జిల్లాలో ఓ విద్యార్థి బాబా అవతారం ఎత్తి.. విద్యార్థుల చేతిలో నిప్పులు పోశాడు. దాంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మెదక్ జిల్లా నరసాపూర్ మండలం పెద్దచింతకుంట సమీపంలోని సీతారాం తండాలో అల్లూరి సీతారామరాజు గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వినోద్ అనే విద్యార్థి సెల్ఫోన్ ఇటీవల పోయింది. దాంతో.. అతడు 'బాబీ బాబా'ను ఆశ్రయించాడు. సదరు బాబీ బాబా ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. వారానికోసారి బాబా అవతారం ఎత్తుతాడు.
వినోద్ను ఎవరిమీదైనా అనుమానం ఉందా అని బాబీ బాబా అడిగితే.. ఐదుగురు విద్యార్థుల పేర్లు చెప్పాడు. దాంతో వాళ్లను తీసుకురమ్మని చెప్పగా.. తీసుకెళ్లాడు. వెంటనే బాబీ బాబా వాళ్ల చేతుల్లో నిప్పులు పోసి ఎవరి చేతులు కాలితే వాళ్లే దొంగలన్నట్లుగా అగ్నిపరీక్ష పెట్టాడు. ఐదుగురికి చేతులు కాలడంతో వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మాయిల చేతుల్లో నిప్పులు పోసిన 'బాబీ బాబా'
Published Sat, Dec 27 2014 2:41 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM
Advertisement
Advertisement