తెలగ, బలిజ, కాపు ఐకాస హెచ్చరిక, రెండో రోజూ ధర్నా
సాక్షి , న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించిన కిరణ్‌కుమార్ రెడ్డి కొత్తపార్టీ పెట్టినా ఆయనను ఓడించి తీరుతామని తెలగ,బలిజ, కాపు ఐక్యకార్యచరణ వేదిక ఉద్ఘాటించింది. కిరణ్ కాపు వర్గం ద్రోహి అని తీవ్రస్థాయిలో దుయ్యబట్టింది. తెలగ, బలిజ, కాపు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆయా కులాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా గురువారానికి రెండో రోజుకు చేరింది.
ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ దాసరి రాము మాట్లాడుతూ, కిరణ్ కుమార్‌ను ఓడిస్తామన్నారు. మంత్రిరామచంద్రయ్య మాట్లాడుతూ.. కాపుల ఆర్థిక, సామాజిక సర్వే నిమిత్తం బీసీ సంక్షేమ శాఖకు రూ.69 లక్షలు కేటాయించాలని కిరణ్ కు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. కాపు నేతలు అన్నిపార్టీలపై ఒత్తిడి పెంచాలన్నారు. ధర్నా అనంతరం కాపు నేతలు ఏఐసీసీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు, మేనిఫెస్టో కమిటీ పెద్దలను కలిసి ఎన్నికల హామీని వెంటనే అమలు చేయాలని కోరారు.
కిరణ్ కొత్త పార్టీ పెట్టినా ఓడిస్తాం
Published Fri, Feb 21 2014 3:41 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement