విశాఖ రాజధాని కాకుండా బాబు అడ్డుపుల్ల | Vizag Citizen Form take on Andhra pradesh CM Chandrababu naidu | Sakshi
Sakshi News home page

విశాఖ రాజధాని కాకుండా బాబు అడ్డుపుల్ల

Published Tue, Jul 29 2014 11:52 AM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

విశాఖ రాజధాని కాకుండా బాబు అడ్డుపుల్ల - Sakshi

విశాఖ రాజధాని కాకుండా బాబు అడ్డుపుల్ల

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం రాజధాని కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని వైజాగ్ సిటిజన్ ఫోరం ఆరోపించింది. మంగళవారం విశాఖపట్నంలో రాజధాని ఎంపికపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరీపై సిటిజన్ ఫోరం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపిక చేసేందుకు విశాఖపట్నం నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపింది.

రాజధాని ఎంపికపై ఏర్పాటైన ప్రొ. శివరామకృష్ణన్ కమిటీ విశాఖలో గతంలో పర్యటించిందని ఫోరం ఈ సందర్బంగా గుర్తు చేసింది. ఆ సమయంలో రాజధానిగా విశాఖపట్నం నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని కమిటీ చెప్పిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నం ఏర్పాటు కాకుండా చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement