'బాలయ్యను సీఎం చేయాలి' | balakrishna to andhra pradesh chief minister says shabbir ali | Sakshi
Sakshi News home page

'బాలయ్యను సీఎం చేయాలి'

Published Mon, Jun 8 2015 3:50 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

'బాలయ్యను సీఎం చేయాలి' - Sakshi

'బాలయ్యను సీఎం చేయాలి'

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆత్మకు శాంతి కలగాలంటే తక్షణం ఆయన కుమారుడు, టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి మొదలు పెట్టింది చంద్రబాబేనన్నారు. ఆనాడు ఆయనకు అండగా నిలబడింది కేసీఆర్ అని షబ్బీర్ అన్నారు.

ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయటంలో చంద్రులిద్దరూ గురుశిష్యులేనని చెప్పారు. తాజా ఘటనతో దొరికిన వాళ్లే దొంగలు అయ్యారని షబ్బీర్ అన్నారు. చంద్రబాబుకు నైతికత ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ స్థానాన్ని ఎన్టీఆర్ తనయుడు బాలయ్యతోనే పూరించాలని సూచించారు. బాలయ్య సీఎం అయితేనే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని షబ్బీర్ అలీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement