ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యుల నివాళి | Nandamuri Family Tributes Paid To NTR On His Death Anniversary | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 18 2019 8:37 AM | Last Updated on Fri, Jan 18 2019 10:16 AM

Nandamuri Family Tributes Paid To NTR On His Death Anniversary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అన్నివర్గాల అభ్యున్నతికి పాటు పడిన పాటు మహనీయుడు ఎన్టీఆర్‌ అని ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ 23వ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు చేయూత నిచ్చి అధికారం కట్టబెట్టిన ఘనత తన తండ్రికి చెందుతుందని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన గుర్తుండిపోతారని చెప్పారు. తెలుగువారందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ ఎన్టీఆర్‌ అని, ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని నందమూరి రామకృష్ణ అన్నారు. మరణం లేని మహానీయుడు ఎన్టీఆర్‌ అని సినీ దర్శకుడు క్రిష్‌ వ్యాఖ్యానించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ కూడా తమ తాతకు నివాళులు అర్పించారు.


తాత స్ఫూర్తితో ముందడుగు: సుహాసిని
తన తాత ఎన్టీఆర్‌ అడుగు జాడల్లో నడుస్తామని, ఆయన స్ఫూర్తితో ముందడుగు వే​స్తున్నామని నందమూరి సుహాసిని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎల్లప్పుడూ కృషి చేశారన్నారు. ప్రజలు ఆయనకు దేవుళ్ల సమానమని, వారి కోసం ఎంతో పాటు పడ్డారని చెప్పుకొచ్చారు. ఆయనను స్మరించుకుంటూ నివాళులు అర్పించామని తెలిపారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement