Nandamuri Family
-
ఎన్టీఆర్ టాలీవుడ్ ఎంట్రీ.. యంగ్ టైగర్ ట్వీట్ వైరల్!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, బాలయ్య, హరికృష్ణ ఇలా ఎందరో సూపర్ స్టార్స్ ఉన్నారు. తాజాగా ఈ కుటుంబం నుంచి మరో యంగ్ హీరో ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా అరంగేట్రం చేస్తున్నారు.ఈ సినిమాను వైవీఎస్ చౌదరి తెరకెక్కించనున్నారు. న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా వైవీఎస్ చౌదరి ప్రకటించారు. కొత్త హీరో యంగ్ ఎన్టీఆర్‌ను ఆయన పరిచయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ చేశారు.ఎన్టీఆర్ తన ట్వీట్లో రాస్తూ..'రామ్ మొదటి అడుగుకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి లెక్కలేనన్ని క్షణాలను అందజేస్తుంది. నీకు విజయం తప్పకుండా వస్తుంది. మీ ముత్తాత ఎన్టీఆర్ , తాత హరికృష్ణ , నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది' అంటూ పోస్ట్ చేశారు. All the best on the first of many steps Ram. The world of cinema will offer you countless moments to cherish… Wishing you nothing but success! With the Love and blessings of your great grandfather NTR garu, grandfather Harikrishna garu and father Janakiram anna, I’m sure you’ll… pic.twitter.com/Op1jRr6KQ7— Jr NTR (@tarak9999) October 30, 2024 -
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో నందమూరి కుటుంబానికి అవమానం
-
నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్న వరుస విషాదాలు
నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు నుంచి ఇప్పుడు తారకరత్న వరకు వరుస విషాదాలు నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. వారికి తీరని దు:ఖాన్ని మిగుల్చుతున్నాయి. కొందరు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే మరికొందరు ఆసక్మికంగా మరణించడం నందమూరి కుటుంబంలో అంతులేని శోకాన్ని మిగిల్చుతోంది. మొదటగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సినీ నిర్మాతగా రాణిస్తున్న సమయంలోనే రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఆ తర్వాత త్రివిక్రమరావు చిన్న కుమారుడు హరిన్ చక్రవర్తి కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. 1996లో 'మామ కోడళ్ల సవాల్' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన హరిన్ చక్రవర్తి ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయక పాత్రలు పోసించారు. నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే ఆయన్ను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. హరిన చక్రవర్తి సోదరుడు కల్యాణ్ చక్రవర్తి కుమారుడు పృథ్వీ సైతం రోడ్ యాక్సిడెంట్లోనే కన్నుమూశారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ 1962లో అరుదైన వ్యాధితో చనిపోయారు. ఆ సమయంలో ఇరుగు పొరుగు షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్ కొడుకు చనిపోయాడన్న వార్త తెలిసి కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాకే ఇంటికి వెళ్లారట. కొడుకు మరణవార్తతో తీవ్రంగా కుంగిపోయిన ఆయన ఆ విషాదం నుంచి బయటకు రావడానికి చాలా సమయమే పట్టిందట. 1996లో సీనియర్ ఎన్టీఆర్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుమారుడు సాయికృష్ణ 2004లో ఆకస్మికంగా మృతి చెందారు. 2014 లో ఎన్టీఆర్ మరో కుమారుడైన హరికృష్ణ పెద్ద కొడుకు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. నిర్మాతగా కొనసాగిన ఆయన నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా 2009లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక పెద్ద కుమారుడు జానకీరామ్ మరణించిన నాలుగేళ్లకు నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూశారు. ఓ అభిమాని వివాహానికి హాజరై హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతుండగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ అక్కడికక్కడే కన్నుమూశారు.ఇక గతేడాది ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడడం ఎన్టీఆర్ కుటుంబాన్ని కలచివేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పుడు తాజాగా తారకరత్న మరణం మరోసారి నందమూరి కుటుంబాన్ని కుదిపేసింది. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స పొందుతున్న ఆయన గతరాత్రి తుదిశ్వాస విడిచారు. ఇలా కొన్నాళ్లుగా వరుస విషాదాలతో నందమూరి కుటుంబానికి శాపంగా మారింది. -
తారకరత్న మృతి బాధాకరం.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్
సాక్షి, తిరుపతి: టీడీపీ నేత, నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. కాగా, తారకరత్న మృతిపై తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమైన విషయం. చంద్రబాబు మా కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంభించాడు. నారా లోకేష్ పాదయాత్రకు, లోకేష్‌కు చెడ్డ పేరు వస్తుందని తారకరత్న మరణవార్తను ఇన్నాళ్లు దాచిపెట్టిన వ్యక్తి చంద్రబాబు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారు. రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసినప్పడే మరణ వార్త ప్రకటించి ఉండాలి. ప్రజలు అపశకునంగా భావిస్తారని ఇన్నాళ్లు డ్రామా చేశారు. తండ్రీకొడుకులు రాష్ట్రానికే అపశకునం అని ప్రజలకు తెలుసు. తారకరత్న భార్యాబిడ్డలను, తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసిన వ్యక్తి చంద్రబాబు. నీచమైన రాజకీయాలు చేయడం మానేస్తేనే నందమూరి కుటుంబం బాగుపడుతుందని వ్యాఖ్యలు చేశారు. -
ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యుల నివాళి
-
ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యుల నివాళి
సాక్షి, హైదరాబాద్: అన్నివర్గాల అభ్యున్నతికి పాటు పడిన పాటు మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ 23వ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు చేయూత నిచ్చి అధికారం కట్టబెట్టిన ఘనత తన తండ్రికి చెందుతుందని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన గుర్తుండిపోతారని చెప్పారు. తెలుగువారందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ ఎన్టీఆర్ అని, ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని నందమూరి రామకృష్ణ అన్నారు. మరణం లేని మహానీయుడు ఎన్టీఆర్ అని సినీ దర్శకుడు క్రిష్ వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తమ తాతకు నివాళులు అర్పించారు. తాత స్ఫూర్తితో ముందడుగు: సుహాసిని తన తాత ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడుస్తామని, ఆయన స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామని నందమూరి సుహాసిని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎల్లప్పుడూ కృషి చేశారన్నారు. ప్రజలు ఆయనకు దేవుళ్ల సమానమని, వారి కోసం ఎంతో పాటు పడ్డారని చెప్పుకొచ్చారు. ఆయనను స్మరించుకుంటూ నివాళులు అర్పించామని తెలిపారు. -
ఇష్టమైన డ్రైవింగే.. విషాదం నింపింది!
సాక్షి, హైదరాబాద్ : నందమూరి హరికృష్ణతోపాటు ఆయన కుటుంబసభ్యులకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయన చైతన్యరథాన్ని హరికృష్ణ స్వయంగా నడిపారు. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో హరికృష్ణ చైతన్యరథం నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తండ్రి ఎన్టీఆర్‌ను సినిమా షూటింగ్‌లకు తానే స్వయంగా కారు నడుపుతూ తీసుకెళ్లేవారు. ఇంట్లో పలువురు డ్రైవర్లు ఉన్నా.. స్వయంగా వాహనం నడపడానికే ఆయన ఇష్టపడేవారు. డ్రైవింగ్‌లో ఆయన నిష్ణాతుడు అని పేరు ఉంది. ఈ క్రమంలోనే నెల్లారు జిల్లా కావలిలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు బుధవారం తెల్లవారుజామున స్వయంగా వాహనం నడుపుతూ బయలుదేరి వెళ్లారు. ఇంతలో జరిగిన తాజా విషాదం నందమూరి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. నందమూరి అభిమానులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నందమూరి హరికృష్ణ కుటుంబానికి ఎంతో ఇష్టమైన డ్రైవింగే.. వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని, 2009లో నల్లగొండ జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుప్రమాదంలో గాయాలపాలై.. అదృష్టవశాత్తు బయటపడ్డారని, నాలుగేళ్ల కిందట హరికృష్ణ తనయుడు జానకీరామ్ రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు హరికృష్ణ సైతం రోడ్డుప్రమాదంలో ప్రాణాలు విడిచారని అభిమానులు అంటున్నారు. -
ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలి: హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌లో సమాధి వద్ద నివాళులు అర్పించి, స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరికృష్ణ.. తెలుగు ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప నేత అని కొనియాడారు. నేడు ప్రతి ఇంట ఒక బిడ్డ ఎన్టీఆర్‌లా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారని ఆయన అన్నారు. తనకు, తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ జయంతి ఒక పర్వదినం లాంటిదని హరికృష్ణ వెల్లడించారు. ఎన్టీ రామరావు గురించి చెప్పడానికి తరాలు, యుగాలు సరిపోవని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతి, అభివృద్ధి కోరకున్న గొప్పనాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు. ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు పాఠ్యాంశాలుగా ఉన్నాయని, అలాగే ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని ముఖ్యఘట్టలను తెలుగు రాస్ట్రాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని తెలుగు ప్రభుత్వాలను కోరారు. తెలుగువారికి ఒక భాష ఉందని నిరూపించారని, తెలుగు రాష్ట్ర ప్రజలు తరాలు చెప్పుకొనే సేవ చేశారని హరికృష్ణ అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎర్రకోటపై జెండా ఎగరవేసిన మహోన్నత వ్యక్తి అని చెప్పారు. ఒకప్పుడు పార్టీలో రథసారధిగా ఉన్న మీరు మహానాడుకు ఎందుకు వెళ్లలేకపోయారన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు. హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నందమూరి కుటుంబం దూరం
-
‘తెలుగువారందరిదీ ఒకటే కులం’
-
‘తెలుగువారందరిదీ ఒకటే కులం’
హైదరాబాద్: ఎన్టీఆర్ జయంతి తెలుగు ప్రజలకు పర్వదినమని ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన వారసులు ఆదివారం నివాళులు అర్పించారు. పెద్దాయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు మరవలేనివని అన్నారు. తెలుగువారంతా ఒకటే కులమని.. మానవ కులమని పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు తన తాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. ఎన్ని తరాలు గడిచినా ఎన్టీఆర్ ఖ్యాతిని తెలుగు జాతి మర్చిపోదని హీరో కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. -
నందమూరి కుటుంబం దూరం
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. విశాఖలో శనివారం ప్రారంభమైన టీడీపీ మహానాడు వేదికపై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల జాడ కన్పించలేదు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈసారి మహానాడుకు దూరంగా ఉన్నారు. వేదికపై ఆహ్వానితుల జాబితా పిలిచినప్పుడు ఆయన పేరు ప్రస్తావించినప్పటికీ తొలిరోజు మహానాడుకు రాలేదు. ముఖ్యమంత్రి చంద్ర బాబు వియ్యంకుడు, ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం తొలిరోజు వేదికపై కనిపించలేదు. వీరే కాదు నందమూరి కుటుం బానికి చెందిన ఏ ఒక్కరూ మహానాడు ప్రాంగణంలో కన్పించక పోవడం చర్చనీయాంశమైంది. సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్లే బాలకృష్ణ రాలేదని తెలియడంతో మహానాడు కంటే సినిమా షూటింగ్‌లు ముఖ్యమా అని పలువురు నేతలు చర్చించుకున్నారు. హరికృష్ణను సరిగ్గా ఆహ్వానించి ఉండరని.. అందువల్లే ఆయన రాలేదని కొందరు నాయకులు వ్యాఖ్యానించడం వినిపించింది. హరికృష్ణ తనయుడు, జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా ఆహ్వానం అంది ఉండదన్న వ్యాఖ్యలు వినిపించాయి. -
జానకిరామ్ మృతి పట్ల ప్రముఖలు సంతాపం
హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నాయకుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు తమ సంతాపం ప్రకటించారు. జానకిరామ్ మృతిపై ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు సంతాపం తెలిపారు. అలాగే టీడీపీ మంత్రులు, పార్టీ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నందమూరి కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని ప్రకటించారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రముఖ సీని నటుడు శ్రీకాంత్... జానకిరామ్ మరణ వార్త తెలియగానే తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. జానకిరామ్ ఆత్మకు శాంతి కలగాని వారు కొన్ని నిముషాలు మౌనం పాటించారు. -
చెల్లి పెళ్లికి ఆహ్వానం అందలేదా!
నందమూరి కుటుంబంలో జరిగిన.... చెల్లెలు పెళ్లికి ఇద్దరు అన్నలు దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ కుమారుడు మోహనకృష్ణ కుమార్తె మోహన రూప వివాహానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ డుమ్మా కొట్టాడు. నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, పురందేశ్వరి, కల్యాణ్ రామ్ ఇతర కుటుంబ సభ్యులు హాజరు అయిన ఈ వేడుకకు జూనియర్, తారకరత్న మాత్రం మిస్ అయ్యారు. అయితే వీరిద్దరికీ ఆహ్వానం అందలేదని అందుకే ఎన్టీఆర్‌తో పాటు తారకరత్న కూడా హాజరు కాలేదని ఓ ఆంగ్ల దినపత్రికలో వార్త ప్రచురితం అయ్యింది. గత ఏడాది బాలకృష్ణ కుమార్తె తేజస్విని పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. అప్పట్లో ఈ వార్త టాలీవుడ్‌తో హాట్ టాఫిక్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చెల్లెలు పెళ్లికి ఆహ్వానం అందక పోవటం వల్లే జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో బాలకృష్ణ తరపున అబ్బాయి ప్రచారం చేయకపోవటంతో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ కారణాలతోనే అబ్బాయిని దూరంగా పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే షూటింగ్లో బాబాయ్ కాలికి దెబ్బ తగలటంతో... అబ్బాయ్ స్పందించి త్వరగా కోలుకోవాలంటూ ట్విట్ కూడా చేశాడు. ఇక నందమూరి తారకరత్నకు కూడా పెళ్లి పిలుపు అందలేదట. కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా అలేఖ్య అనే ఆమెను తారకరత్న ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడిని కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు. తారకరత్న తల్లిదండ్రుల సూచన మేరకు అతడిని వివాహానికి ఆహ్వానించలేదట. ఇంతకు ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందిందా లేక కావాలనే హాజరు కాలేదా అనేది టాలీవుడ్‌తో పాటు రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశం అయ్యింది. -
అబ్బాయి 'ట్వీట్'ని బాబాయ్ స్వీకరిస్తారా?
నందమూరి ఫ్యామిలీలో నెలకొన్న నిశ్శబ్దాన్ని చాలా రోజులకు జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. గత కొంతకాలంగా బాబాయ్‌కి దూరంగా ఉన్న అబ్బాయ్.... ట్విట్టర్ ద్వారా పలకరించాడు. నాలుగు రోజుల క్రితం ఓ షూటింగ్లో నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గాయపడిన విషయం తెలిసిందే. సినిమా చిత్రీకరణలో భాగంగా బాలయ్య బైక్ మీదనుంచి జారిపడటంతో స్వల్పంగా గాయపడ్డాడు. దాంతో బాలయ్య ఆరోగ్యంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అది కూడా ట్విట్వర్ వేదికగా. ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో స్పందిస్తూ... 'అభిమానులు కంగారుపడొద్దు, బాబాయ్ క్షేమంగా ఉన్నాడు' అని ట్వీట్ చేశాడు. మళ్లీ సింహం గర్జిస్తుందని తన ట్వీట్లో పేర్కొన్నాడు. బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూ.ఎన్టీఆర్ విష్ చేశాడు. అయితే ఇద్దరు హైదరాబాద్‌లో ఉన్నా.... జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా బాబాయ్‌ని కలిసి ఆరోగ్యంపై ఆరా తీయకుండా కేవలం సోషల్ మీడియా ద్వారానే పలకరించటం విశేషం. ఇటీవలి కాలంలో నందమూరి ఫ్యామిలీ ఒకటిగా కనిపించిన దృశ్యాలు అరుదనే చెప్పుకోవచ్చు. ఇక నందమూరి కుటుంబం మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అవకాశం ఉన్నప్పుడల్లా తామంతా ఒక్కటే అన్న సంకేతాలు ఇచ్చినా అవి చిలకపలుకుల్లాంటివే. ఇటీవలి జరిగిన ఎన్నికలు నందమూరి ఫ్యామీలి మధ్య విభేదాలు తారాస్థాయికి తీసుకు వెళ్లాయి. తండ్రి హరికృష్ణను చంద్రబాబు పక్కనపెట్టి... బాబాయ్‌కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటంతో పాటు... పార్టీలో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో హరితో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా కినుక వహించారు. దాంతో ఎన్నికల ప్రచారానికి కూడా వారు దూరంగా ఉన్నారు. పిలిస్తే తాను పార్టీ కోసం ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఇదే విషయమై బాలకృష్ణ స్సందిస్తూ 'ప్రచారం చేయాలని ఎవ్వరినీ బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. ఇదేమి ఇంట్లో పెళ్లికాదు' అని వ్యాఖ్యానించిన తెలిసిందే. అప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీలో వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా బాబాయ్ ఆరోగ్యంపై జూనియర్ స్పందించటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ రభస త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో... బాబాయ్‌తో పాటు అభిమానులకు చేరువ కావటానికి... జూనియర్ ప్రయత్నిస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రభస ఆడియో విడుదల కార్యక్రమంలోనూ అబ్బాయ్ ఒంటరిగానే కనిపించాడు. మరి అబ్బాయి 'ట్వీట్' పలకరింపును బాబాయ్ ఎలా స్వీకరిస్తారో చూడాలి. ఇక గాయపడిన బాలయ్యను చంద్రబాబు స్వయంగా వెళ్లి పలకరించటం కొసమెరుపు. -
నందమూరి ఫ్యామిలీ 'వార్'
నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తమ కుటుంబం మధ్య ఎలాంటి విబేధాలు లేవని తామంతా ఒక్కటే అన్న సంకేతాలు ఇచ్చినా..... బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని వివాహం వేదికగా అన్నదమ్ముల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. బాలయ్య ఇంట శుభకార్యానికి ఆయన సోదరుడు, టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవటం రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశమైంది. అయితే హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ వివాహానికి హాజరయ్యారు. మరోవైపు అసలు జూనియర్ ఎన్టీఆర్‌కు వివాహ ఆహ్వానం అందలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు జూనియర్ ఎన్టీఆర్,చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌ల మధ్య ఏర్పడ్డ విభేదాల కారణంగానే ఎన్టీఆర్‌కు పెళ్లిపిలుపు అందలేదన్న చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌ను పెళ్లికి పిలవనందునే హరికృష్ణ కూడా ఈ వివాహా కార్యాక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తేజస్విని వివాహ వేడుకను జూనియర్ ఎన్టీఆర్ తన ఇంట్లో టీవీలో వీక్షించినట్లు సమాచారం. ఇక హరికృష్ణ, బాలకృష్ణల మధ్య విబేధాలు చోటు చేసుకున్న సంగతి బహిరంగ రహస్యమే. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణిని చంద్రబాబు కుమారుడు లోకేష్ వివాహం చేసుకున్న తర్వాత బాలయ్య, బాబుల దోస్తీ మరింత బలపడింది. బాలకృష్ణ పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడం హరికృష్ణ అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రాధాన్యత ఇవ్వని విషయంలో ఏర్పడిన విబేధాలు హరికృష్ణకు చంద్రబాబుకు మధ్య అంతరం పెంచాయి. తెలుగుదేశం పార్టీ పగ్గాలను చంద్రబాబు తన తనయుడు లోకేష్‌కు అప్పగించాలనే ప్రయత్నాలతోనే వారు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా సోదరుడు బాలయ్య భవిష్యత్తులో బావ నుండి పార్టీ బాధ్యతలు తీసుకొని ‘ముఖ్య’ పదవులను అధిష్టించడమో లేక తన అల్లుడు లోకేష్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా లోకేష్ చేతికి పగ్గాలు పోతే పార్టీ తన చేతుల్లోకి రావడం కుదరదని భావించి పార్టీలో పట్టుకోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ మధ్యకాలంలో బాలయ్య,ఎన్టీఆర్‌లు కొన్ని వేదికలపై కలిసి కనిపించినా, తదుపరి కాలంలో మళ్లీ అంతరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బాబాయ్, అబ్బాయ్‌ల మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. ఆ కారణంగానే జూనియర్ తన మావయ్య, బాబాయ్‌ల పైన అసంతృప్తితోనే ఉన్నారనే ప్రచారం జరిగింది. వీటికి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ....రాజకీయాల్లోకి వచ్చేంత వయసు తనకు రాలేదని.... ప్రస్తుతం సినిమాలపైనే తన దృష్టి అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇటీవల ఈ విభేదాలు సద్దుమణగినట్లు కనిపించినా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తమ రాజకీయాలకు పదును పెడుతూనే ఉన్నారని తెలుస్తోంది. రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ వ్యూహం, తాత సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందుకోవాలనే తపన వెరసి ప్రస్తుతం నందమూరి కుటుంబంలో ప్రచ్ఛన్న యుద్ధానికి కారణమని తెలుస్తోంది. అంతే కాకుండా తెలంగాణ విషయంలో పార్టీ అధ్యక్షుడు, బావ చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హరికృష్ణ బహిరంగంగానే లేఖాస్త్రాలు సంధించారు. సమైక్యాంధ్ర నినాదాన్ని ఎత్తుకున్న హరికృష్ణ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చైతన్య రథయాత్ర చేపట్టనున్నట్లు సమాచారం. తాజా పరిణామాలు తెలుగుదేశం పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది.