టీడీపీ సీనియర్ నాయకుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నాయకుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు తమ సంతాపం ప్రకటించారు.
జానకిరామ్ మృతిపై ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు సంతాపం తెలిపారు. అలాగే టీడీపీ మంత్రులు, పార్టీ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నందమూరి కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని ప్రకటించారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రముఖ సీని నటుడు శ్రీకాంత్... జానకిరామ్ మరణ వార్త తెలియగానే తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. జానకిరామ్ ఆత్మకు శాంతి కలగాని వారు కొన్ని నిముషాలు మౌనం పాటించారు.