
‘తెలుగువారందరిదీ ఒకటే కులం’
హైదరాబాద్: ఎన్టీఆర్ జయంతి తెలుగు ప్రజలకు పర్వదినమని ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన వారసులు ఆదివారం నివాళులు అర్పించారు. పెద్దాయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు మరవలేనివని అన్నారు. తెలుగువారంతా ఒకటే కులమని.. మానవ కులమని పేర్కొన్నారు.
తెలుగు ప్రజలకు తన తాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. ఎన్ని తరాలు గడిచినా ఎన్టీఆర్ ఖ్యాతిని తెలుగు జాతి మర్చిపోదని హీరో కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.