ఎన్టీఆర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ.. యంగ్ టైగర్‌ ట్వీట్‌ వైరల్! | Janaki Ram Son Nandamuri Taraka Rama Rao Entry As Tollywood Hero | Sakshi
Sakshi News home page

NTR: ఎన్టీఆర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ.. ఆల్‌ ది బెస్ట్‌ అంటూ జూనియర్ పోస్ట్!

Published Wed, Oct 30 2024 2:07 PM | Last Updated on Wed, Oct 30 2024 2:14 PM

Janaki Ram Son Nandamuri Taraka Rama Rao Entry As Tollywood Hero

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకున్న క్రేజ్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, బాలయ్య, హరికృష్ణ ఇలా ఎందరో సూపర్‌ స్టార్స్‌ ఉన్నారు. తాజాగా ఈ కుటుంబం నుంచి మరో యంగ్ హీరో ఎంట్రీకి సిద్ధమవుతున్నారు.  నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు.. తారక రామారావు హీరోగా అరంగేట్రం చేస్తున్నారు.

ఈ సినిమాను వైవీఎస్‌ చౌదరి  తెరకెక్కించనున్నారు. న్యూ టాలెంట్‌ రోర్స్ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా వైవీఎస్‌ చౌదరి ప్రకటించారు. కొత్త హీరో యంగ్‌ ఎన్టీఆర్‌ను ఆయన పరిచయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆల్‌ ది బెస్ట్ చెబుతూ పోస్ట్‌ చేశారు.

ఎన్టీఆర్ తన ట్వీట్‌లో రాస్తూ..'రామ్ మొదటి అడుగుకు  ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి లెక్కలేనన్ని క్షణాలను అందజేస్తుంది. నీకు విజయం తప్పకుండా వస్తుంది. మీ ముత్తాత ఎన్టీఆర్ , తాత హరికృష్ణ , నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులతో  ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది' అంటూ పోస్ట్ చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement