
చంద్రబాబు ప్రజలను పిట్టల్లా చేసి...
రాష్ట్ర ప్రజలను పిట్టల్లా చేసి వారిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రహ్మాస్త్రాన్ని వదులుతున్నారని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు హామీలలో భాగంగా చంద్రబాబు రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, బెల్ట్ షాపుల నిషేధంపై ఎలాంటి కండిషన్స్ చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు రుణమాఫీకి కమిటీ ఎందుకు వేశారని ప్రశ్నించారు. చంద్రబాబు పేదల జీవితాలతో ఆడుకోకూడదని తాను కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. బెల్ట్షాపులు ఎప్పటిలోగా మూయిస్తారో వెల్లడించాలని ఈ సందర్భంగా చంద్రబాబును రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.
నాగార్జునసాగర్ నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి 10 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని గవర్నర్ ఏర్పాటు చేసిన కమిటీ వెల్లడించింది. దీనిపై టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెప్పడం బాధాకరమని ఆయన తెలిపారు. చంద్రబాబు అవినీతి రహిత సమాజాన్ని తెస్తామని అంటున్నారని.... అయితే చంద్రబాబు గతంతో తనపై ఉన్న రెండు కేసుల్లో స్టే తెచ్చుకున్నారని రఘువీరా గుర్తు చేశారు. ముందు ఆ కేసులు విషయం తేల్చుకోవలంటూ చంద్రబాబుకు రఘువీరా హితవు పలికారు.