
'రుణాలు మాఫీ చేయకుంటే ఉద్యమిస్తాం'
రైతులకు ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆదివారం అనంతపురంలో డిమాండ్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హమీ ప్రకారం రైతుల రుణాలు మాఫీ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
అన్ని రకాల రైతు రుణాలు మాపీలు చేయకుంటే ఉద్యమిస్తామని చంద్రబాబును హెచ్చరించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎన్నిక ముందు చెప్పి. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం న్యాయమా అంటూ చంద్రబాబును రఘువీరారెడ్డి ప్రశ్నించారు.