craft loans
-
'చంద్రబాబు నరకం చూపిస్తున్నాడు'
అనంతపురం: రాష్ట్రంలోని రైతులు, మహిళలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నరకం చూపిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శనివారం అనంతపురం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... రుణమాఫీ అంటూ ఓట్లేయించుకున్న చంద్రబాబు ... సీఎం పదవి చేపట్టి రెండు నెలలు అయిన రుణాలు మాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు. బ్యాంకర్లు రైతులకు నోటీసులు ఇస్తున్న బాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రుణాలు మాఫీ చేయకపోతే ఏడాదిలో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని రామకృష్ణ జోస్యం చెప్పారు. -
టీడీపీలోని బడా వ్యాపారుల కోసమే 'తాత్కాలిక రాజధాని'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించడం తగదని రాయలసీమ రాజధాని సాధన సమితి (ఆర్‌ఆర్‌ఎస్‌ఎస్) అభిప్రాయపడ్డింది. గురువారం హైదరాబాద్‌లో ఆ సంస్థ ప్రతినిధులు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.... టీడీపీలోని బడా వ్యాపారులకు లబ్ది చేకూర్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఆ ప్రకటన చేసిందని ఆరోపించారు. రాయలసీమలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే మరో ఉద్యమం రాష్ట్రంలో ఉద్బవిస్తుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా అములు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రైతుల రుణమాఫీకి డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం... విజయవాడలో భూ సేకరణకు రూ. 40 వేల కోట్లు ఎలా పెడుతున్నారని ఆర్‌ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆగస్టు 16న ధర్నా చౌక్‌లో ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేస్తామని వారు వెల్లడించారు. -
రుణమాఫీ చేయకుండానే సంబరాలా ?
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు రుణమాపీపై మొదటి సంతకం చేస్తానంటూ ప్రకటించిన చంద్రబాబు... ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదని సీపీఐ నాయకుడు రామకృష్ణ ఆరోపించారు. కానీ రుణమాఫీ చేసినట్లు పచ్చ పార్టీ నేతలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం గుంటూరు నగరంలోని కొత్తపేటలో సీపీఐ కార్యాలయంలో రైతు సమస్యలపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు రుణాలు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి... వారికి కూడా రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులకు ఆదేశించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. -
'రాజధాని విషయంలో మా జోక్యముండదు'
-
'తెలంగాణ అంబాసిడర్ సానియాపై స్పందించను'
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ఆయన మంత్రి వర్గం ఎవరి ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో వెంకయ్య మాట్లాడుతూ... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి కూర్చుంటే చాలా వివాదాలు పరిష్కారమవుతాయని తెలిపారు. రుణమాఫీలో కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించే నిబంధనలే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వర్తిస్తాయని చెప్పారు. బ్రిక్స్ సమావేశాలు, యూపీఎస్పీ నిబంధనలు, రైలు ఛార్జీలు వంటి పలు అంశాలల్లో కేంద్రాన్ని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ... ప్రస్తుతం సెల్ప్ గోల్ చేసుకుంటోందని చెప్పారు. కాంగ్రెస్, ఇతర పక్షాలు తమ ఓటమిని జీర్ణించుకోలేకే తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని అన్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన క్రీడాకారిణి సానియా మీర్జా అంశంపై స్పందించేందుకు వెంకయ్య నిరాకరించారు. విభజన ద్వారా తమకు అన్యాయం జరిగిందని భావిస్తే సదరు ఉద్యోగులు కమిటీకి విన్నవించుకోవచ్చని వెంకయ్యనాయుడు సూచించారు. -
'చంద్రబాబు, ఆయన కేబినెట్‌ది పెద్ద మాయాజాలం'
హైదరాబాద్: రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గం మెజీషియన్లను మించిన మాయాజాలం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ ఇచ్చిన నరకాసురవధ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని తెలిపారు. రైతులను మోసకారని... వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర చంద్రబాబుదని ఈ సందర్బంగా ఆమె గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం రైతును 30 ఏళ్లు వెనక్కి నడిపించిందని ఆరోపించారు. రుణమాఫీ నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు చంద్రబాబు రైతులను తప్పు పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను బేషరతుగా అమలు చేయాలని వాసిరెడ్డి పద్మ ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. -
రుణమాఫీ అమలుపై ఆలోచిస్తున్నాం: యనమల
రుణమాపీ అమలుకు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ... వాటి గురించి ఆలోచిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో యనమల మాట్లాడుతూ... కేంద్రం నుంచి రావాల్సిన రూ. 7 వేల కోట్ల సీఎస్పీని రావాల్సి ఉందని తెలిపారు. వాటిని విడుదల చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. గత ప్రభుత్వం 9 నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలపై తమ ప్రభుత్వం సమీక్షిస్తుందని యనమల తెలిపారు. -
'బాబు... మోసం, దగా చేయబోతున్నారు'
ఎన్నికల నేపథ్యంలో రైతులకు ఇచ్చిన హమీ ప్రకారం తక్షణమే వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులు, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తానని హమీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం రైతులను మోసం, దగా చేయబోతున్నారని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో రైతుల రుణమాఫీపై చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరీపై అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. రుణమాఫీ అంటే అర్థం రీషెడ్యూల్ చేయడమా అంటూ చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా రీషెడ్యూల్ చేస్తానంటూ చంద్రబాబు ప్రకటించడంపై ఇంతకన్నా దౌర్బాగ్యం మరొకటి లేదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. -
'రుణాలు మాఫీ చేయకుంటే ఉద్యమిస్తాం'
రైతులకు ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆదివారం అనంతపురంలో డిమాండ్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హమీ ప్రకారం రైతుల రుణాలు మాఫీ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అన్ని రకాల రైతు రుణాలు మాపీలు చేయకుంటే ఉద్యమిస్తామని చంద్రబాబును హెచ్చరించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎన్నిక ముందు చెప్పి. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం న్యాయమా అంటూ చంద్రబాబును రఘువీరారెడ్డి ప్రశ్నించారు. -
కేసీఆర్‌లా బాబు మాటమారిస్తే ఒప్పుకోం
రైతు రుణమాఫీ హామీని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లా చంద్రబాబు మాటమారిస్తే ఒప్పుకోమని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. అలా కాకుంటే తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చంద్రబాబు నాయుడిని రామచంద్రారెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా నేటి రాత్రి ప్రమాణ స్వీకారం చేయున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం రైతుల రుణమాఫీ దస్త్రంపై సంతకం చేస్తానని ప్రకటించి సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తానని ఎన్నిక ముందు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎం పీఠం ఎక్కిన తర్వాత కేసీఆర్ మాట మార్చారు. కేవలం రూ. లక్ష మాత్రమే రుణమాఫీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. దాంతో కేసీఆర్ ప్రకటనపై తెలంగాణ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా కేసీఆర్ అడుగుజాడల్లో నడిస్తే సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబు నాయుడిని హెచ్చరించారు. -
షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి.. లేదంటే ..
రైతుల రుణమాఫీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ షరతులు విధించడం అన్యాయమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ సభపక్ష నేత డీఎస్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం షరతులు విధించడం రైతులను ఓ విధంగా మోసం చేయడమేనని విమర్శించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాల్సిందేనని ఆయన సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. గురువారం డీఎస్ హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు రుణమాఫీ అని గెలిచిన తర్వాత షరతులు విధించడం ఎంత వరకు సమంజసమని ఆయన ఈ సందర్భంగా కేసీఆర్‌ని డీఎస్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే రైతు రుణామాఫీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ తొలి హమీ ఇచ్చిందని డీఎస్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇచ్చిన హమీని అమలు పరచకుండా మాట తప్పితే తెలంగాణ ప్రభుత్వానికి సహకరించమని డీఎస్ హెచ్చరించారు. ఎటువంటి షరతులు లేకుండా రూ. లక్ష రూపాయల రుణమాఫీ చేయాలిని కేసీఆర్ ప్రభుత్వాన్ని డీఎస్ డిమాండ్ చేశారు. -
రుణమాఫీపై బ్యాంకర్లతో భేటీకానున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నిన్న బాధ్యతులు చేపట్టిన కేసీఆర్ ఎన్నికలలో ప్రకటించిన హామీలను నెరవేర్చేందుకు నడుంబిగించారు. అందులోభాగంగా వీలైనంత త్వరగా రైతులు రుణమాఫీపై నిర్ణయం తీసుకోవాలని ఆయన నిర్ణయించారు. అందుకోసం ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో కేసీఆర్ హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. బ్యాంకర్లు, ఉన్నతాధికారులతో రుణమాఫీ సాధ్యసాధ్యాలపై కేసీఆర్ ఈ సందర్బంగా చర్చించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో రూ.లక్షలోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని కేసీఆర్ రైతులకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ముందు రుణమాఫీ చేయి బాబు...
-
ముందు రుణమాఫీ చేయి బాబు...
ఎన్నిలక నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉండాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందే రైతుల రుణ మాఫీ ప్రక్రియను పూర్తి చేసి... ఆ తర్వాతే కొత్త రుణాలు రైతులకు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కొరినట్లు రఘువీరారెడ్డి వెల్లడించారు. రఘువీరారెడ్డి అధ్యక్షతను ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు బుధవారం రాజభవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిశారు. అనంతరం రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల అనంతరం తమ రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశ్యంతో సీమాంధ్ర రైతులు తమ పేర్లను రెన్యువల్ చేసుకోలేదని... దీంతో బ్యాంకులు రైతులకు తాజాగా రుణాలు ఇవ్వడం లేదన్నారు. రుణమాఫీపై చంద్రబాబు స్పష్టత ఇవ్వకపోవడం వల్లే రైతుల్లో ఆందోళన నెలకొందని ఆయన ఆరోపించారు. బ్యాంకర్లతో మాట్లాడి రైతు రుణాల సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. ఎంసెట్‌లో ప్రైవేట్ సంస్థల జోక్యాన్ని నిరోధించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు రఘువీరారెడ్డి వెల్లడించారు.