'చంద్రబాబు నరకం చూపిస్తున్నాడు' | CPI state secretary Rama Krishna takes on AP CM Chandrababu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు నరకం చూపిస్తున్నాడు'

Published Sat, Aug 16 2014 2:00 PM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM

'చంద్రబాబు నరకం చూపిస్తున్నాడు' - Sakshi

'చంద్రబాబు నరకం చూపిస్తున్నాడు'

అనంతపురం: రాష్ట్రంలోని రైతులు, మహిళలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నరకం చూపిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శనివారం అనంతపురం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... రుణమాఫీ అంటూ ఓట్లేయించుకున్న చంద్రబాబు ... సీఎం పదవి చేపట్టి రెండు నెలలు అయిన రుణాలు మాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు.

బ్యాంకర్లు రైతులకు నోటీసులు ఇస్తున్న బాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రుణాలు మాఫీ చేయకపోతే ఏడాదిలో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని రామకృష్ణ జోస్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement