రుణమాఫీపై బ్యాంకర్లతో భేటీకానున్న కేసీఆర్ | One or two days Telangana Chief minister K. chandrashekara rao meeting with bankers due to craft loans | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై బ్యాంకర్లతో భేటీకానున్న కేసీఆర్

Published Tue, Jun 3 2014 12:24 PM | Last Updated on Wed, Aug 15 2018 8:04 PM

రుణమాఫీపై బ్యాంకర్లతో భేటీకానున్న కేసీఆర్ - Sakshi

రుణమాఫీపై బ్యాంకర్లతో భేటీకానున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నిన్న బాధ్యతులు చేపట్టిన కేసీఆర్ ఎన్నికలలో ప్రకటించిన హామీలను నెరవేర్చేందుకు నడుంబిగించారు. అందులోభాగంగా వీలైనంత త్వరగా రైతులు రుణమాఫీపై నిర్ణయం తీసుకోవాలని ఆయన నిర్ణయించారు. అందుకోసం ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో కేసీఆర్ హైదరాబాద్లో సమావేశం కానున్నారు. బ్యాంకర్లు, ఉన్నతాధికారులతో రుణమాఫీ సాధ్యసాధ్యాలపై కేసీఆర్ ఈ సందర్బంగా చర్చించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో రూ.లక్షలోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని కేసీఆర్ రైతులకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement