మహిళపై ల్యాండ్‌ మాఫియా ఆగడం.. | woman Set On Fire By Land Mafia In Assam | Sakshi

కబ్జాను అడ్డుకున్న మహిళపై దాడి

Jun 5 2020 12:50 PM | Updated on Jun 5 2020 1:23 PM

woman Set On Fire By Land Mafia In Assam - Sakshi

అసోంలో పెచ్చుమీరిన ల్యాండ్‌ మాఫియా ఆగడాలు

గువహటి :  భూవివాదంలో 50 సంవత్సరాల మహిళను ల్యాండ్‌ మాఫియా సజీవ దహనం చేసిన ఘటన అసోంలోని హజోయి జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మాఫియా దౌర్జన్యం నుంచి మహిళను కాపాడిన పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని షీలా బేగంగా పోలీసులు గుర్తించారు. తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకోగా వారు తనను సజీవంగా దహనం చేసి చంపేందుకు ప్రయత్నించారని, తాను గాయాలతో వారి బారి నుంచి బయటపడ్డానని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

చదవండి :  దారుణం: మరో మాట లేకుండా ప్రాణాలు తీశారు

మధ్య అసోం దక్షిణ్‌ సమరాలి ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటుచేసకుంది. భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన మాఫియా ముఠాను మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి అడ్డుకోగా దుండగులు ఆమెపై దాడికి తెగబడి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement