ప్రభుత్వ భూమేగా లాగించేయ్‌  | TDP Leaders Land Scams In Prakasam | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమేగా లాగించేయ్‌ 

Published Sun, May 5 2019 11:19 AM | Last Updated on Sun, May 5 2019 11:19 AM

TDP Leaders Land Scams In Prakasam - Sakshi

సర్వేనంబర్‌ 1160లోని ప్రభుత్వ భూమి

ఒంగోలు సబర్బన్‌: ఒంగోలు డెయిరీలో తోడే కొద్దీ అక్రమాల పుట్ట కదులుతోంది..రూ.కోట్లకు కోట్లు కొల్లగొట్టిన తెలుగుదేశంకు చెందిన డెయిరీ పాత పాలకమండలి పాలు, పాల పదార్థాల రూపంలో తాగేసిన, తినేసిన దాదాపు రూ.100 కోట్ల లెక్కలు మాయం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అందుకే పాత అధికారులను పక్కన పెట్టి డెయిరీకి నూతనంగా ముగ్గురు అధికారులను నియమించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో డెయిరీ లెక్కలను ఆడిట్‌ చేసిన చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ నివేదికలో చూపించిన రిపోర్టులు మాయం చేసే పనిలో కొత్త అధికారులు నిమగ్నమయ్యారు. గతంలో అక్రమాలు చేసి కాజేసిన డెయిరీ సొమ్మును తిరిగి చెల్లించాలని రూపొందించిన రికవరీ ఫైళ్లు కనుమరుగు చేసినట్లు సమాచారం.

బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు చూపించిన డెయిరీలోని నిల్వలు మాయంచేసి చివరకు బ్యాంకులకే కుచ్చుటోపీ పెట్టిన ఘనత పాత కమిటీ చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావుది. చివరకు రూ.కోట్ల కొద్దీ బొక్కి ఒట్టిపోయిన గేదెను చేసి అధికారులతో ఏర్పాటైన నూతన కమిటీకి డెయిరీని అప్పగించిన చల్లా ఇప్పటికీ అధికార పార్టీని అడ్డంపెట్టుకొని మరీ డెయిరీలో తన పెత్తనమే చెలాయిస్తున్నారు. అందుకే ఆయన చేసిన పా‘‘పాలు’’బయటకు రానీయకుండా ప్రస్తుతం ఉన్న అధికారులపై అధికార తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో బెదిరింపులకు దిగిమరీ తన తప్పులు బయట పెట్టకుండా తన జులుం ప్రదర్శిస్తున్నారు. అందుకే నూతనంగా డెయిరీలోని అక్రమాలు బయటకు కంప్యూటర్‌ ఆపరేటర్, ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ వారు అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించి ఆన్‌లైన్‌లో జరిగిన అక్రమాలను తొలగించారు. అటు తరువాత 2018లో మళ్లీ అదే సర్వే నంబర్‌లో భూములు ఆన్‌లైన్‌ చేయడం గమనార్హం.

తీరప్రాంతంలో భూముల పట్టాలిచ్చేందుకు అనుమతుల్లేవ్‌..
రొంపేరు కాలువ సముద్రంలో కలిసే ప్రాంతంలో 1160, 1161 సర్వే నంబర్‌లో భూములు ఉన్నాయి. సుమారు 1455.49 ఎకరాలను ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదయ్యాయి. సుమారు 20 కి.మీ పైనుంచి రొంపేరు కాలువ ద్వారా సముద్రానికి నీరు వచ్చి చేరే ముఖ ద్వారంగా ఈ ప్రాంతం కొనసాగుతుంది. దూరప్రాంతం నుంచి పంట కాలువల మురుగు నీరు వచ్చి సముద్రంలో కలిసే ప్రాంతం కూడా ఇదే. ఈ ప్రాంతంలో జీవవైవిధ్యంలో ప్రముఖ పాత్ర వహించే మడ చెట్లు విపరీతంగా పెరిగి సముద్రం నుంచి వచ్చే ఆటుపోట్లను తట్టుకునేందుకు, సముద్రపు కోత నుంచి తట్టుకునేందుకు, ప్రకృతి వైపరీత్యాలను కాపాడుకునేందుకు ఉపయోగకరమైన ప్రాంతం. జీవవైవిధ్యానికి అనుకూలం గా ఉండి పక్షులు, సముద్రపు జీవులు ఈ ప్రాంతంలో గుడ్లను పొదిగి సంతా నోత్పత్తి చేసేందుకు అనువుగా ఉంటుంది. ఈ ప్రాంతం వ్యవసాయానికి, నివాసాలకు అమోదయోగ్యం కాదు. ఆక్రమణలకు గురి కావడం వలన భవిష్యత్‌ రోజుల్లో సంభవించి విపత్తుల వలన గ్రామాలు తుడిచి పెట్టుకొని పోయి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది.
 
ఇష్టారీతిగా భూముల ఆన్‌లైన్‌: 
1160 సర్వే నంబర్‌లో భూములను సబ్‌ డివిజన్‌ చేసినట్లుగా చూపుతూ సబ్‌డివిజన్‌ 31 నుంచి 38 వరకు సుమారు 29 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌ చేసి ఉన్నతాధికారుల దృష్టికి సైతం విషయాన్ని తీసుకెళ్లకుండా ఆక్రమణదారులకు పట్టాదారు ఖాతాను కేటాయించి పుస్తకాలు ఇచ్చేశారు. భూములను రెవెన్యూ సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించి అనధికారికంగా ఉప్పు కొఠారులు, చెరువులు తవ్వేందుకు ప్రోత్సహిస్తూ, భారీ మొత్తంలో అక్రమార్జన చేస్తున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించి పై అధికారుల దృష్టికి తీసుకొని పోకుండా అసలైనవిగా చలామణి చేస్తున్నారు. కొత్తగా ఖాతాలను తెరచి సంబంధిత వ్యక్తులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలను, డీకే పట్టాలను సైతం తయారు చేసి అసలైనవిగా అమలు పరిచి ఆక్రమణదారులకు కట్టబెట్టారు. 2014లో మాన్యువల్‌ పట్టాదారు పాస్‌ పుస్తకాలను రద్దు చేసిన ప్రభుత్వం ఈ పాస్‌ పుస్తకాలను పట్టాదారులకు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

అయినా చినగంజాం తహసీల్దార్‌ కార్యాలయంలో 1–07–2018 నుంచి 19–07–2018 పిరియడ్‌లో ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌గా పనిచేసిన అధికారి మాన్యువల్‌ పాసు పుస్తకాలను అందజేయడంతో పాటు ఖాతా నంబర్‌లను సైతం మార్పు చేసి ఇచ్చారు. వారు గతంలో అందుకున్న పట్టాలు ఫోర్జరీ అయిన విషయాన్ని కూడా గుర్తించకుండా పాస్‌ పుస్తకాలు జారీ చేయడం ఇక్కడ విశేషం. అప్పటి తహసీల్దార్‌గా పనిచేసిన అబ్రహం 2002లో తహసీల్దార్‌గా జాయిన్‌ కాగా ఆయన సంతకంతో 2001లోనే పట్టాలు మంజూరయ్యాయి. ఇదే విధంగా సుమారు 29 ఎకరాల భూమికి ఫోర్జరీ సంతకాలతో పట్టాలు మంజూరు రెవెన్యూ అధికారులు అక్రమంగా ఆన్‌లైన్‌ చేసి భారీ మొత్తంలో రాత్రికి రాత్రే ఆక్రమణదారుల నుంచి నగదు తీసుకున్నట్లు సమాచారం.

ప్రభుత్వ భూమిని పంపిణీ చేయాలంటే నిబంధనలు ఇవీ..
ప్రభుత్వ భూమిని అందుకునేందుకు లబ్ధిదారులు భూమిలేని నిరుపేదలు అయి ఉండాలి. ఎసైన్‌మెంట్‌ వేస్ట్‌(ఏడబ్ల్యూ లాండ్‌గా) బంజరు భూమిగా మార్చి డీకే పట్టాలు అందజేయాలి. లబ్ధిదారులకు షరతులతో కూడిన పట్టా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందు కోసం మొదటగా గ్రామంలో భూమిలేని పేదలను గుర్తించి వారందించే దరఖాస్తులను పరిశీలించిన తహసీల్దార్‌ ఆ భూమికి సంబంధించి మార్పులు చేసి దానిని మొదటగా పంచాయతీ కార్యాలయంలో గ్రామ కూడలిలో చాటింపు, దండోరాల ద్వారా తెలియజేయాలి. చేసిన తరువాత అందిన దరఖాస్తులను పరిశీలించి గ్రామ అసైన్‌మెంట్‌ కమిటీ పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసి సదరు భూమిని ప్రభుత్వ భూమి నుంచి మార్పు చేసి సదరు భూమికి సబ్‌ డివిజన్‌ కేటాయిస్తూ డీకే పట్టాలు మంజూరు చేయాలి. మంజూరు చేసేం దుకు రెండు కాపీలను తయారు చేయా లి. ఒక కాపీని లబ్ధిదారుడికిచ్చి రెండో కాపీని కార్యాలయంలో భద్ర పరచాలి. ఇందు కోసం ప్రత్యేకంగా డీకే రిజిస్టర్‌ను సైతం నిర్వహించాల్సి ఉండగా, తహసీల్దార్‌ కార్యాలయంలో అటువంటి రిజిష్టర్‌లు లేకపోవడం హాస్యాస్పదం.
సమస్యను మరుగును పెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

కట్టా శ్రీనివాసరావు, సామాజిక కార్యకర్త 
పెదగంజాం పరిధిలోని ప్రభుత్వ భూమికి సంబంధించి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా విషయాన్ని కాలయాపన చేస్తూ కాల దోషం పట్టిస్తున్నారు. గతంలో జిల్లా ఉన్నతాధికారులు తిరస్కరించిన భూములకు పట్టాలు ఇచ్చారు. ఆన్‌లైన్‌ అవకతవకలపై ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుపోగా వారు విచారణను కాలయాపన చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement