తిమ్మాపురంలో భూకబ్జారాయుళ్ల ఆగడాలు శృతిమించాయి.
విశాఖపట్నం: జిల్లాలోని తిమ్మాపురంలో భూకబ్జారాయుళ్ల ఆగడాలు శృతిమించాయి. మహిళలంతా తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు భూకబ్జారాయుళ్లు మహిళలనే కనీస గౌరవభావం లేకుండా అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపించారు. దీంతో మహిళలు తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ అక్కడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా ఓ మహిళ భూకబ్జారాయుళ్లు తనను వివస్త్రను చేశారని పోలీసులను ఆశ్రయించింది. భూకబ్జారాయుళ్ల ఆగడాలను అడ్డుకోవాలని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.