బర్త్డే గిఫ్ట్ | SriSri Movie release to krishna Birthday Gift | Sakshi
Sakshi News home page

బర్త్డే గిఫ్ట్

May 25 2016 11:32 PM | Updated on Sep 4 2017 12:55 AM

బర్త్డే గిఫ్ట్

బర్త్డే గిఫ్ట్

అక్షరాల్లో అగ్నికణాలు నింపి తెలుగు రచనా ప్రపంచంలో చైతన్య శిఖరారోహణ చేసిన మహాకవి శ్రీశ్రీ.

అక్షరాల్లో అగ్నికణాలు నింపి తెలుగు రచనా ప్రపంచంలో చైతన్య శిఖరారోహణ చేసిన మహాకవి శ్రీశ్రీ. అలాంటి చైతన్యాన్ని రగిలించే పాత్రలో సూపర్‌స్టార్ కృష్ణ కనిపిస్తారు. ఆయన ప్రధానపాత్రలో ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీశ్రీ’. ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ నిర్మించిన ఈ చిత్రం కృష్ణ పుట్టినరోజు (మే 31) కానుకగా జూన్ 3న రిలీజవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ, ‘‘అలనాటి శ్రీశ్రీ భావజాలం నేటి సగటు మనిషిలో పుడితే అన్నదే కథాంశం.

మహాకవి శ్రీశ్రీగారు తన ఆవేశాన్ని రచనల్లో చూపిస్తే, మా చిత్రంలో శ్రీశ్రీ చేతల్లో చూపిస్తారు. కృష్ణగారు సినిమా ఇండస్ట్రీకొచ్చి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దాం, వారి ఆశీస్సులు కావాలి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కృష్ణ తనయుడు, హీరో మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో విశేషం. విజయనిర్మల, సీనియర్ నరేశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇ.ఎస్.మూర్తి, కెమెరా: సతీష్ ముత్యాల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement