
హీరో నితిన్‌కు నాలుగేళ్ల తర్వాత మంచి బ్రేక్ ఇచ్చిన భీష్మ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుములకు నితిన్ మంచి గిఫ్ట్ ఇచ్చాడు. బుధవారం దర్శకుడు వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఖరీదైన రేంజ్ రోవర్ కారును ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన భీష్మ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నితిన్, రష్మికా మందన్నా జంటగా నటించిన ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. నాలుగేళ్ల తర్వాత నాకు హిచ్ వచ్చిందంటూ హీరో నితిన్ స్వయంగా చెప్పాడు. ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇవ్వడం పట్ల డైరెక్టర్ వెంకీ ఆనందం వ్యక్తం చేశాడు. (జిమ్ ట్రైనర్‌కు ప్రభాస్ గిఫ్ట్)
‘ఉత్తమ వ్యక్తులతో మంచి సినిమాలు చేస్తే ఇలాంటివే జరుగుతాయి. ఇంత మంచి బహుమతి ఇచ్చినందుకు థ్యాంక్యూ’ అంటూ తన సంతోషాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ వెంకి కుడుములతో కలిసి తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే చరణ్‌కు వెంకీ స్క్రిప్ట్ కూడా వినిపించాడట. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారని సమాచారం. ఇప్పటికే ‘ఛలో’, ‘భీష్మ’ లాంటి సినిమాలతో కామెడీ, యాక్షన్, లవ్ ట్రాక్ లను బాగా ప్రొజెక్ట్ చేయగల వెంకీ కుడుముల స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. (తెలుగు సీరియల్ నటి ఆత్మహత్య)
When u make a best film with the
— Venky Kudumula (@VenkyKudumula) September 8, 2020
best person, best things happen !
Thank you so much for this best birthday gift @actor_nithiin anna..
Love u loads.. 😍😘🤗🤩 pic.twitter.com/JX5cw38e6f
Comments
Please login to add a commentAdd a comment