
సిద్దిపేట జోన్: తన పుట్టినరోజు జూన్ 3 నాటికి సిద్దిపేట జిల్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని కానుకగా ఇస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన నాగులబండ సమీపంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి భవన నిర్మాణ పనులు, త్రీ స్టార్ టూరిజం హోటల్ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్‌లను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. రెండు ఎకరాల్లో చేపడుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టూరిజం శాఖ ఏఈ సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment