lv prasad eye hospital
-
టపాసుల వేళ అపశ్రుతులు.. మంటలంటుకుని కళ్లకు, ఒంటికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి వేళ బాణసంచా కాలుస్తున్న క్రమంలో నగరంలో కొన్నిచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. పలువురికి కళ్లకు, ఒంటికి గాయాలయ్యాయి. నగర వ్యాప్తంగా సుమారు 100 మందికి పైగా బాధితులు పలు ఆస్పత్రుల్లో చేరారు. కంటి గాయాలకు గురైనవారిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. సరోజినీదేవి ఆస్పత్రికి క్యూ.. మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో దీపావళిని ముందు రోజు ముగ్గురు, పండగ రోజు రాత్రి సమయంలో 45 మంది దాకా కంటి గాయాలతో సంప్రదించారు. ఇందులో 21 మంది అవుట్ పేషెంట్ విభాగంలో చూపించుకుని వెళ్లిపోగా 19 మంది అడ్మిట్ అయ్యారు. పండగ తర్వాత రోజు కూడా మరో 2 కేసులు వచ్చాయని వైద్యులు చెప్పారు. వీరిలో అయిదేళ్ల వయసు నుంచి 67 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. మొత్తం బాధితుల్లో అత్యధికులు చిన్నారులే. బాధితుల్లో మల్లెపల్లికి చెందిన అజయ్ సింగ్ (25), విజయ్ ఆనంద్ (61), సి. మహావీర్ (15)ల ఎడమ కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు కుడికన్నుకు గాయమైన హయత్‌నగర్‌కు చెందిన రాజి (37)లకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. బాధితుల్లో ఒక అబ్బాయి కంటి చూపు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి.. బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి పెద్ద సంఖ్యలోనే బాణసంచా బాధితులు నమోదయ్యారు. పండగ ముందురోజున అయిదుగురు, దీపావళి రోజున 21 మంది, మరుసటి రోజున (సాయంత్రం 4గంటల వరకూ) 11 మంది కంటి గాయాలతో ఆస్పత్రికి వచ్చారని వీరిలో 9 మందికి సర్జరీలు చేశామని వైద్యులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో బాణసంచా కారణంగా 7 కాలిన గాయాల కేసులు నమోదయ్యాయి. చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తీవ్రగాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు. పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ బాణసంచా బాధితులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కాలిన గాయాలతో ఉస్మానియాకు... నగరంలో కంటి గాయాలతో చిన్నారులు ఆస్పత్రుల పాలు కాగా కాలిన గాయాలతో పెద్దలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. ఉస్మానియా ఆస్పత్రిలో 18 మందికి కాలిన గాయాల బాధితులు సంప్రదించగా ఇందులో ఒకరు తీవ్ర గాయాలతో అడ్మిట్ అయ్యారు. శరీరం కాలిన ఆ మహిళ (63) పరిస్థితి విషమంగా ఉందని, ఆమె దాదాపు 95 శాతం కాలిన గాయాల బారిన పడడంతో వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
స్వదేశీ త్రీడీ ప్రింటెడ్ మానవ కార్నియా
బంజారాహిల్స్ (హైదరాబాద్): భారతదేశంలో మొదటిసారిగా త్రీడీ ప్రింటెడ్ మానవ కార్నియాను బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, సీసీఎంబీ, ఐఐటీ విద్యార్థులు అభివృద్ధి చేశారు. యుద్ధ సమయంలో సైనికులకు వ్యక్తిగతంగా కార్నియల్ గాయాలు తగిలినప్పుడు, లేదా తృతీయ నేత్ర సంరక్షణ సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాల్లో కంటిచూపు అందించడానికి ఇది దోహదపడుతుంది. మేడిన్ ఇండియా ప్రొడక్ట్‌లో భాగంగా భారతీయ వైద్యులు, శాస్త్రవేత్తల బృందం కార్నియల్ అంధత్వానికి చవకైన పరిష్కారాన్ని అందజేసింది. మానవదాత కార్నియల్ టిష్యూ నుంచి త్రీడీ ప్రింటెడ్ కార్నియాను ఈ బృందాలు అభివృద్ధి చేశాయి. ప్రభుత్వం, దాతృత్వ నిధుల ద్వారా దీన్ని దేశీయంగా అభివృద్ధి చేశారు. ఇందులో సింథటిక్ భాగాలు జంతువుల అవశేషాలు లేకుండా రోగులకు ఉపయోగించడానికి సురక్షితమైనవిగా, సహజమైనవిగా ఈ ప్రొడక్ట్‌ను తయారు చేసినట్లు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చెందిన ప్రధాన పరిశోధకులు డాక్టర్ సయ్యన్ బసూ, డాక్టర్ వివేక్‌సింగ్ తెలిపారు. కార్నియా పారదర్శకంగా లేకుండా మారడం లేదా కార్నియా క్రమంగా సన్నగా మారడం వంటి వ్యాధుల చికిత్సలో అద్భుతమైన, చౌకగా అందించగలిగే ఆవిష్కరణ ఇది అన్నారు. ఈ త్రీడీ ప్రింటెడ్ కార్నియా తయారు చేయడానికి ఉపయోగించే బయో ఇంక్, కార్నియల్ చిల్లులను మూసివేయడానికి, యుద్ధ సంబంధితమైన గాయాల సమయంలో ఇన్ఫెక్షన్ నిరోధించడానికి, గాయపడ్డ ప్రదేశంలో చూపు కోల్పోకుండా సహాయ పడుతుందని వెల్లడించారు. కార్నియా అనేది కంటి ముందు పొర అని, ఇది కాంతిని కేంద్రీకరించడంలో చూపు స్పష్టంగా ఉండటంతో సహాయ పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.5 మిలియన్లకు పైగా కొత్త కార్నియల్ బ్లైండ్నెస్ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. -
రాష్ట్రంలో అత్యాధునిక కంటి వైద్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా రాష్ట్రంలోనే అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి యాజమాన్యం అంగీకారం తెలిపింది. దీంతో సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కంటి ఆస్పత్రి ఏర్పాటుకానుంది. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్. రావు, వ్యవస్థాపక సభ్యుడు జి. ప్రతిభారావు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. కడపలో టెరిషియరీ కేర్ ఐ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్లో తీసుకున్న నిర్ణయంపై ఆస్పత్రి యాజమాన్యం సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే.. రాష్ట్రంలో కాంప్రహెన్సివ్ ఐ కేర్‌కు సంబంధించి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ముఖ్యమంత్రితో ప్రాథమికంగా చర్చలు కూడా జరిపింది. ఈ సందర్భంగా ఏపీలో అంతర్జాతీయ స్థాయిలో కంటి ఆస్పత్రిని ఏర్పాటుచేయాలని.. అంధత్వ నివారణకు స్క్రీనింగ్ నుంచి సర్జరీ వరకూ అన్ని స్థాయిలలోనూ అత్యాధునిక వైద్యం ఇక్కడే అందించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధంచేయాలని సీఎం జగన్ సూచించగా.. అందుకు ఆస్పత్రి యాజమాన్యం సంసిద్ధత తెలిపింది. అంతేకాక.. రాష్ట్రంలోని అన్ని అనాధ శరణాలయాల్లోని చిన్నారులకు నేత్రవైద్య పరీక్షలు, చికిత్స ఉచితంగా చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ముందుకొచ్చింది. ఈ సమావేశంలో ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్, వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌రెడ్డి పప్పూరు, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. -
అవ్వాతాతలకు కంటి చూపు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదు.. చికిత్సలేని కారణంగా కంటిచూపునకు ఎవరూ దూరం కాకూడదు.. అన్న సత్సంకల్పంతో ప్రారంభమైన వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తోంది. ఈ యజ్ఞంలో ఇప్పటివరకు 93వేల మందికి పైగా అవ్వాతాలకు కేటరాక్ట్ (కంటి శుక్లాలు) సర్జరీలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన వారు 56.88 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వీరిలో ఇప్పటివరకు 11.80 లక్షల మందికి కంటిపరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలు చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 413 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాయి. కరోనా కేసులు తగ్గిన తర్వాత పీహెచ్సీ స్థాయి నుంచి బోధనాసుపత్రి వరకూ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించి పరీక్షలు చేస్తున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు ఇస్తున్నారు. వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల దూకుడు సెకండరీ కేర్ (వైద్యవిధాన పరిషత్) పరిధిలో ఉండే జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోని కంటి వైద్యులు శస్త్రచికిత్సల్లో దూకుడుగా వెళ్తుండగా, బోధనాసుపత్రుల్లో ఉన్న కంటి డాక్టర్లు మాత్రం తగిన స్థాయిలో సర్జరీలు చేయలేకపోతున్నారు. విచిత్రమేమంటే 11 బోధనాసుపత్రుల్లో 107 మంది కంటివైద్య నిపుణులు ఉండగా, వారంతా కలిసి 4,495 శస్త్రచికిత్సలు మాత్రమే చేశారు. అదే వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో కేవలం 40 మంది మాత్రమే ఉండగా వీరు 5,143 ఆపరేషన్లు చేశారు. వాస్తవానికి నిపుణుడైన డాక్టర్ కంటిశుక్లాల ఆపరేషన్లు రోజుకు 8 నుంచి 10 వరకూ చేయచ్చు. కానీ, డీఎంఈ ఆస్పత్రుల్లో ఉన్న పెద్ద డాక్టర్లు గడిచిన మూడు మాసాల్లో ఒక్కొక్కరు సగటున 42 మాత్రమే చేశారు. ఇప్పటికీ చాలాచోట్ల కరోనా పేరుతో చికిత్స చేయడంలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో తక్కువ కంటి ఆపరేషన్లు చేస్తున్న ఆస్పత్రులు, డాక్టర్ల వివరాలను ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పేద రోగులకు మెరుగైన చికిత్స చేయాలని అధికారులు ఇప్పటికే వైద్యులకు పిలుపునిచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో వైద్యులకు శిక్షణ ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యాన్నే అవ్వాతాతలకు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఇక్కడి వైద్యులకు బృందాల వారీగా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో కేటరాక్ట్ సర్జరీలు మరింత నైపుణ్యంతో చేయడానికి వైద్యులకు వీలు కలుగుతోంది. కంటి వెలుగు చికిత్స వివరాలు.. ► ఇప్పటివరకూ స్క్రీనింగ్ చేసింది : 11,80,170 మందికి ► మందులు అవసరమైన వారు : 4,64,850 ► కేటరాక్ట్ ఆపరేషన్లు జరిగినవి : 93,566 ► కళ్లద్దాలు అవసరమైన వారు : 6,05,680 ► ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన కేటరాక్ట్ ఆపరేషన్లు :9,638 ► ఎన్జీవో/ఆరోగ్యశ్రీ కింద చేసినవి : 48,129 ► ప్రైవేటు ఆస్పత్రుల్లో.. : 35,799 -
పర్యటన రద్దు.. హైదరాబాద్‌కు నిమ్మగడ్డ
సాక్షి, విజయవాడ: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వైఎస్సార్ జిల్లా పర్యటన చివరి నిముషంలో వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై సోమవారం సంబంధిత జిల్లాల అధికారులతో ఎస్ఈసీ సమీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఆయనకు కంటి ఇన్ఫెక్షన్ కారణంగా పర్యటన రద్దు అయ్యింది. కంటి పరీక్షల కోసం హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి నిమ్మగడ్డ వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో తొలి విడతలో 2,723 గ్రామ పంచాయతీల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం ఆదివారం రాత్రి 7.30 గంటలతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది. (చదవండి: పిచ్చి పీక్స్‌కు.. తుగ్లక్‌ను మరిపిస్తున్న నిమ్మగడ్డ) (కోడెల శివరామ్‌పై టీడీపీ నేత ఫిర్యాదు) -
ముఖ్యమంత్రి చొరవ.. ఈ చిన్నారి హ్యాపీ..
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): కేరళలోని సాధారణ కుటుంబానికి చెందిన ఓ చిన్నారి ముఖంలో వెలుగులు నింపేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరన్ విజయన్‌తో పాటు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి శైలజ స్పందించిన తీరు కదిలించింది. కేరళనుంచి అంబులెన్స్‌తో పాటు ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు వెళ్ళేందుకు అనుమతి పత్రాలు ఇప్పించడమే కాకుండా ఆ పాప ఆపరేషన్ అయ్యేంత వరకు బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులకు తగిన సూచనలు ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే... కేరళ అలప్పుజకు చెందిన ఎలక్ట్రీషియన్ వినీత్ విజయన్–గోపిక దంపతుల కూతురు అన్విత(21నెలలు) కంటి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో రెటీనో బ్లాస్టోమా కీమో థెరపీ చికిత్స చేయించుకుంటోంది. చికిత్సలో భాగంగా బుధవారం ఆమెకు కీలకమైన ఇంట్రా ఆర్టీరియల్ కీమో థెరపి సైకిల్ చేయాల్సి ఉంది. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కేరళ నుంచి హైదరాబాద్‌కు రావడం ఎంత కష్టమో తండ్రి వినీత్ సోషల్ మీడియాలో తన ఆవేదన వెల్లడించాడు. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఆరోగ్య శాఖామంత్రి స్పందించారు. ఫేస్బుక్లో చిన్నారి ఎదుర్కొంటున్న బాధను చూసిన కేరళ సమాజం మొత్తం స్పందించింది. ప్రభుత్వం అంబులెన్స్‌తో పాటు ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేసి హైదరాబాద్ వెళ్ళేందుకు అనుమతిచ్చారు. బుధవారం చిన్నారికి ఈ వైద్య చికిత్స పూర్తి చేశారు. ఒక వేళ అనుకున్న సమయానికి పాపను తీసుకురాకపోతే ఇప్పటి వరకు తీసుకున్న చికిత్స మొత్తం వృథా అయ్యేదని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి కేన్సర్ సేవల అధిపతి డాక్టర్ స్వాతి కలిగి అన్నారు. (పిల్లలూ.. ఇంటర్నెట్తో జాగ్రత్త) -
ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం
సాక్షి, సిద్ధిపేట: జిల్లా కేంద్రంలోని నాగులబండలో నూతనంగా నిర్మించిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎల్వీ ప్రసాద్, గొల్లపల్లి ఎన్ రావు, హెటిరో చైర్మన్ పార్థసారథి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా మారాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్, వరంగల్‌లో మాత్రమే మెడికల్ కళాశాలలు ఉండేవని.. రాష్ట్రవ్యాప్తంగా అనేక మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 1987లో ప్రారంభించిన ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిని నాలుగు రాష్ట్రాలకు విస్తరించి ప్రజలకు సేవలందించడం అభినందనీయమన్నారు. ఆసుపత్రి సేవలను సిద్ధిపేట ప్రజలు వినియోగించుకోవాలన్నారు. హైదరాబాద్‌లో 400 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రిని పార్థసారథి రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. మొట్టమొదటిగా సిద్ధిపేటలో క్యాన్సర్ స్క్రినింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని హరీష్‌రావు కోరారు. -
ఆరోగ్య తెలంగాణ లక్ష్యం
సిరిసిల్ల: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హైదరాబాద్‌కు చెందిన ఎల్వీ ప్రసాద్ వైద్యవిజ్ఞాన సంస్థ సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్న కంటి ఆస్పత్రి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కంటి సమస్యల పరిష్కారానికి కంటి వెలుగు పథకాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం లో కంటి సమస్యలు లేకుండా చేస్తామని వివరించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి ఆరోగ్య స్థితిగతులను సేకరించి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామని వివరించారు. ఆరోగ్య తెలంగాణను సాధించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థలూ ముందుకు రావాలి.. సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, మనిషికి ప్రపంచాన్ని చూపించేవి కళ్లని, అలాంటి కంటి వైద్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల పేదల సేవలో ముందుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న సేవలకు తోడుగా ప్రైవేటు సంస్థలు కూడా పేదల సేవకు ముందుకు వస్తే బాగుంటుందన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల, హెటెరో వంటి సంస్థలు సిరిసిల్లలో పేదలకు సేవలందించేందుకు ముందుకు రావడం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. హెటెరో ఫౌండేషన్ సిరిసిల్లలో రూ.5 కోట్లతో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కంటి ఆస్పత్రి భవనాన్ని నిర్మిస్తుందని వివరించారు. వీరి స్ఫూర్తితో మరిన్ని సంస్థలు పేదల వర్గాలకు సేవలందించేందుకు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్వీ ప్రసాద్ సంస్థ వైస్‌చైర్మన్ ఆత్మకూరి రామన్ మాట్లాడుతూ.. 32 ఏళ్లుగా ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల 2.80 కోట్ల మంది పేదలకు వైద్య సేవ లు అందించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కంటి వైద్యసేవల్లో ఎల్వీ ప్రసాద్ సంస్థ ముందుందని పేర్కొన్నారు. హెటెరో సంస్థ ప్రతినిధి రత్నాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మా సంస్థ సంపద సృష్టించి పది మందికి పంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని తెలిపారు. భవన నిర్మాణానికి రూ.50 లక్షల చెక్కును కేటీఆర్‌కు అందించారు. -
ఎన్జీవోల ద్వారా ‘కంటి వెలుగు’
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమంలో పెండింగ్‌లో ఉన్న ఆపరేషన్లను పూర్తిచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు స్వచ్ఛంద సంస్థ లు, ఎల్వీ ప్రసాద్ వంటి ప్రముఖ ఆస్పత్రుల్లో వీలైనంత త్వరగా కంటి ఆపరేషన్లు చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలోనూ అదనపు వసతులు కల్పించి ఆపరేషన్లు జరిగేలా ఏర్పా ట్లు చేయాలని ఆ శాఖ భావిస్తోంది. దీనికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్నికల వల్ల నిలిచిన ఆపరేషన్లను సత్వరం పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ పథకం కోసం మంజూరై నిలిచిన రూ. 87.29 కోట్ల నిధులను ప్రభుత్వం 2 రోజుల క్రితం విడుదల చేసింది. గతేడాది ఆగస్టు 15న ‘కంటి వెలుగు’ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎన్నికల నాటికి 1.55 కోట్ల మందికి కంటి పరీక్షలు చేశారు. పరీక్షలు చేయించుకున్న వారిలో చాలా మంది 18 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు. పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు 90% మంది బడుగు బలహీనవర్గాలకు చెందిన వారే ఉన్నారు. పరీక్షల సందర్భంగా 35 లక్షల మంది కి రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. 20 లక్షల మందికి చత్వారీ గ్లాసులు ఇవ్వాలని ప్రిస్క్రిప్షన్ రాశారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 7.04 లక్షల మందికి పలు రకాల ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు. అందులో 6.64 లక్షల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు అవసరమని తేల్చగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో 23,629 మందికి ఆపరేషన్లు నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా... లక్షలాది మందికి కంటి ఆపరేషన్లు చేయడమ నేది కత్తిమీద సాములాంటిది. అందుకే సాధారణ ప్రైవేటు ఆస్పత్రుల్లో కాకుండా సరోజినీ, ఎల్వీ ప్రసాద్ వంటి ప్రముఖ ఆస్పత్రుల్లోనే ఆపరేషన్లు నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆపరేషన్లు చేయడానికి ముందుకు వచ్చినట్లు వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఆపరేషన్ల సందర్భంగా ఇబ్బందులు తలెత్తాయి. అవి పునరావృతం కాకుండా సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో అదనపు వసతులు కల్పించి ఆపరేషన్లు మొదలుపెట్టాలని ఆ శాఖ యోచిస్తోంది. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వర్గాలతోనూ సంప్రదించి రోజుకు ఎన్ని ఆపరేషన్లు చేయవచ్చన్న దానిపై స్పష్టతకు రానుంది. మరోవైపు కొన్ని స్వచ్ఛంద సంస్థలను గుర్తించి వాటిల్లోనూ చేయనున్నారు. ఇప్పటికే ఆపరేషన్లు అవసరమైన కొందరు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చేయించుకున్నారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. ఎందరు ఆపరేషన్లు చేయించుకున్నారనే సమాచారం తమ వద్ద లేద ని చెబుతున్నాయి. కంటి వెలుగు తర్వాత దంత వైద్య పరీక్షలపైనా సర్కారు దృష్టిసారించనుంది. అయితే ఎప్పుడన్నది తర్వాత చెబుతామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
నా పుట్టినరోజు కానుకగా కంటి ఆస్పత్రి
సిద్దిపేట జోన్: తన పుట్టినరోజు జూన్ 3 నాటికి సిద్దిపేట జిల్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని కానుకగా ఇస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన నాగులబండ సమీపంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి భవన నిర్మాణ పనులు, త్రీ స్టార్ టూరిజం హోటల్ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. రెండు ఎకరాల్లో చేపడుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టూరిజం శాఖ ఏఈ సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు. -
‘కంటి వెలుగు’లో నిర్లక్ష్యం
హన్మకొండ చౌరస్తా (వరంగల్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకంలో ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాల నిర్లక్ష్యం బయటపడింది. కాటరాక్ట్ సర్జరీలను మమ అనిపించిన వైద్యులు పూర్తిగా చెకప్ చేయకుండానే డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిన రోగులు కంటి చూపు సరిగా లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అయితే.. సర్జరీ సరిగా చేయలేకపోయామని గుర్తించిన వైద్యులు మరుసటి రోజే మరోసారి ఆస్పత్రికి రావాలని ఫోన్ చేయడంతో వారి నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. రోగుల అనుమానమే నిజం కావడంతో ఆస్పత్రికి చేరుకుని షాక్‌కు గురయ్యారు. హన్మకొండలోని జయ ఆస్పత్రిలో జరిగిన ఘటన వివరాలు రోగులు, వారి బంధువులు తెలిపిన ప్రకారం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కంటి వెలుగు పథకం కోసం క్యాంపులు ఏర్పాటు చేసి పరీక్షలు చేసిన వైద్యులు, ఆపరేషన్ కోసం ఆయా పథకం అమలవుతున్న ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. ప్రాథమిక వైద్య పరీక్షలు చేసుకున్న పలువురు శస్త్రచికిత్స చేసుకోవడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 18 మంది ఈ నెల 26వ తేదీన హన్మకొండ చౌరస్తాలోని జయ ఆస్పత్రి కి చేరుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్ లక్ష్మిరమాదేవి నేతృత్వంలో కాటరాక్ట్ శస్త్ర చికిత్స చేశారు. ఆపరేషన్ చేసిన మరుసటి రోజు డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. అయితే.. ఇంటికి వెళ్లిన రోగులు కట్లు విప్పితే చూపు లేకపోవడంతో కంగుతిన్నారు. భయంతోనే ఆ రాత్రి నిద్రపోయిన బాధితులకు ఉదయమే జయ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. మీరు అత్యవసరంగా మరొకసారి ఆస్పత్రికి రావాలని, చెకప్ చేసి పంపిస్తామని సిబ్బంది సమాచారం అందించారు. అప్పటికే కళ్లు కనిపించకపోవడం.. ఆస్పత్రి నుంచి ఫోన్ రావడంతో ఆందోళన చెందిన బాధితులు శుక్రవారం హాస్పిటల్‌కు చేరుకున్నారు. అందులో 11 మందికి మరోసారి కాటరాక్ట్ రీఆపరేషన్ చేశారు. మిగతా ఏడుగురిని పరీక్షించి ఫర్వాలేదని చెప్పారు. ఆందోళనకు దిగిన బాధితులు.. రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు ఆపరేషన్ చేయడంపై భయాందోళనకు గురైన బాధిత బందువులు ఈ విషయంపై ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ప్రజాసేన అవినీతి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పుప్పాల రజనీకాంత్ ఆస్పత్రికి చేరుకుని రోగులు, వారి బంధువులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని డీఎంహెచ్ఓ హరీష్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి వైద్యులు, కాసుల కక్కుర్తి కోసం మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆస్పత్రులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న వరంగల్ అర్బన్ జిల్లా డీఎంహెచ్ఓ హరీష్‌రాజు కంటి ఆపరేసన్ చేసుకున్న రోగులు, వారి బంధువులతో మాట్లాడారు. హాస్పిటల్‌లోని ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ ను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసేందుకు అన్ని వసతులు ఉన్నాయని.. అయితే జరిగిన తప్పిదానికి జయ హాస్పిటల్ యాజమాన్యానికి నోటీసులు అందజేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ల్యాబ్‌ను సీజ్ చేశారు. రెండోసారి ఆపరేషన్ ఎందుకంటే చెప్పలేదు.. 20 రోజుల క్రితం నయీంనగర్ లష్కర్‌సింగారంలో నిర్వహించిన క్యాంపులో కంటి పరీక్షలు చేసుకున్నాను. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు. జయ ఆస్పత్రిలో ఉందంటే ఈనెల 26న ఇక్కడికి వచ్చాం. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ లక్ష్మిరమాదేవి ఆపరేషన్ చేసి గురువారం డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లి కట్టు విప్పితే ఏమి కనిపించడం లేదు. అంతలోనే ఉదయం ఆస్పత్రి ఉంచి ఫోన్ వచ్చింది. ఇక్కడికి రాగానే మరోసారి ఆపరేషన్ చేశారు. ఎందుకు రెండోసారి చేస్తున్నారని అడిగితే ఎవరూ పట్టించుకోలేదు. – హెచ్.పద్మ, గిర్నిబావి, దుగ్గొండి, వరంగల్ రూరల్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి రెఫర్ చేశాం జయ ఆస్పత్రిలో కంటి పరీక్షలకు సంబంధించిన అన్ని పరికరాలు, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఇప్పటివరకు 250 కంటి ఆపరేషన్లు చేశారు. ఈనెల 26న చేసిన 18మందిలో ఆరుగురికి ఈ రోజు ఇన్ఫెక్షన్ అయినట్లు గుర్తించి తిరిగి మెరుగైన చికిత్స అందించారు. ఇంకొందరికి తీవ్రత ఎక్కువ ఉన్నట్లు గుర్తించాం. అయినప్పటికీ 18మందిని హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ముందు జాగ్రత్త చర్యగా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశాం. జయ ఆస్పత్రి వైద్యుల నిరక్ష్యంపై విచారణ చేస్తాం. నిర్లక్ష్యమని తేలితే చర్యలు తీసుకుంటాం. – హరీష్‌రాజ్, డీఎంహెచ్ఓ, వరంగల్ అర్బన్ ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను రెండు రోజుల క్రితం జయ ఆస్పత్రికి వస్తే కంటి ఆపరేషన్ చేసి పంపించారు. ఇంటికి పోయిన మరుసటి రోజు ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను. కంటికి ఇన్ఫెక్షన్ అయింది.. ఇంజక్షన్ వేయాలని లోపలికి తీసుకెళ్లారు. మత్తు ఇవ్వడంతో ఆపరేషన్ చేశారా.. లేదో తెలియడం లేదు. – కందుల మల్లయ్య, రాంనగర్, హన్మకొండ మళ్ళీ ఆపరేషన్ చేయాలని లోపలికి తీసుకెళ్లారు రెండు రోజుల క్రితం మా అత్తకు జయ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ చేసి ఇంటికి పంపించారు. మళ్లీ ఈ రోజు ఫోన్ చేసి అర్జెంటుగా ఆస్పత్రికి రావాలని చెప్పారు. చెకప్ చేయాలంటే మా అత్త కొమురమ్మను తీసుకొచ్చాను. రాగానే కంటి పరీక్షలు చేసి.. మళ్లీ ఆపరేషన్ చేయాలని లోపలికి తీసుకెళ్లారు. – అరుణ, బాదితురాలు కొమురమ్మ కోడలు, ములుగు -
వెంకయ్యకు కంటి ఆపరేషన్
హైదరాబాద్: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఆదివా రం కుడి కన్నుకు శస్త్రచికిత్స జరిగింది. ఆస్పత్రి వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో మూడు గంటల పాటు ఆయనకు ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం బంజారాహిల్స్ రోడ్ నం.12లోని స్వగృహానికి వెళ్లారు. కంటి చికిత్స నిమిత్తం ఆయన ఢిల్లీ నుంచి శనివారం నగరానికి వచ్చారు. -
ఏపీ చిన్నారికి తెలంగాణ మంత్రి సాయం
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెట్‌జన్లు తీసుకువచ్చే సమస్యలను తనదైన శైలిలో స్పందించించి పరిష్కరించడంలో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కె తారకరామారావు ఎప్పుడూ ముందుంటారు. ఇలా ఇప్పటికే చాలా సార్లు స్పందించిన మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. అభం శుభం తెలియని చిన్నారి కంటి ఆపరేషన్‌కు రెండు గంటల్లో రెండు లక్షల రూపాయలు మంజూరు చేసి చిన్నారి కంటి చూపు రావడానికి కారణమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ చిన్నారి కంటిచూపు సమస్యతో బాధపడుతోంది. చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న కూడా వర్తించడం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో భరత్ అనే ఓ నెట్‌జన్ వారి సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. బాధితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని, ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నా ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో వర్తించడంలేదంటూ సమస్యను మంత్రి కేటీఆర్‌కు వివరించాడు. చికిత్సకు సిఫారసు చేసి చిన్నారికి అండగా ఉంటాలని ట్విటర్లో కోరాడు. దీనిపై స్పందించిన మంత్రి తప్పక సహాయమందిస్తామని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి తగిన విధంగా ఆదుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. Absolutely adorable she is @KTRoffice to coordinate with LV Prasad Eye Institute or Sarojini Devi Eye hoapiral https://t.co/Krky6RV29s — KTR (@KTRTRS) April 6, 2018 @KTRTRS annayya chinna papa ki eye problem annayya..lv prasads lo operation cheyali..meeru oka letter issue chesthe freega avuddi annayya..velladi AP ..arogya sree work avvadam ledu..pls help annayya.. pic.twitter.com/bIwIGefoET — bharath143 (@kumarbharath) April 6, 2018 -
హైదరాబాద్‌లో ప్రియాంక గాంధీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ దంపతులు హైదరాబాద్ వచ్చారు. ప్రియాంక గాంధీ కుమారుడు రైహన్‌కు కంటి సంబంధిత ఆపరేషన్ నిమిత్తం వారు నగరానికి వచ్చారు. రైహన్ క్రికెట్ ఆడుతుండగా కంటికి గాయమైనందున ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందాడు. కాగా ఎయిమ్స్ వైద్యులు సిఫారసు చేయడంతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వచ్చారు. ప్రత్యేక వైద్య బృందం రైహన్ కు పరీక్షలు నిర్వహిస్తోంది. ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రిలో పోలీసులు భద్రతను పెంచారు. గుళ్లపల్లి ప్రతిభారావు బ్లాక్‌లో ప్రియాంక దంపతులు ఉన్నారు. వీరి వెంట పింకీ రెడ్డి వచ్చారు. కాగా, ప్రియాంక పర్యటన గురించి తమకు తెలియదని, ఇది వారి వ్యక్తిగత పర్యటన అని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. -
ఎల్వీప్రసాద్ ఆస్పత్రికి భారీ విరాళం
హైదరాబాద్: ఎస్బీఐ ఆద్వర్యంలో దేశవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామని, ప్రస్తుతం బ్యాంక్ లాభాల్లో 1 శాతం కేటాయిస్తున్నామని, దాన్ని 2 శాతానికి పెంచడానికి కృషి చేస్తున్నట్లు ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు. గురువారం బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి రూ.1.15 కోట్ల విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్ గుళ్లపల్లి ఎన్రావుకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ విరాళం మొత్తాన్ని పేదల ఉచిత శస్త్ర చికిత్సలకు, ఉచిత ఔట్ పేషెంట్ సేవలకు వినియోగించాలని కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత అందుబాటులోకి తేవడానికి దేశవ్యాప్తంగా 20 గ్రామాల్లో ‘డిజిటల్ విలేజ్ ’ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఒరాకిల్ కంపెనీతో కలిసి ‘డీ ఛేంజ్’ పేరుతో అగస్ట్ 6వ తేదీన హైదరాబాద్‌లో ఓపెన్ స్కూళ్లు ప్రారంభిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఇలాంటి 100 పాఠశాలలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎల్వీ ప్రసాద్ సంస్ద అందిస్తున్న సేవలను అభినందించారు. అనుబంధ బ్యాంక్‌ల విలీనంపై అడిగిన ప్రశ్నకు స్పందించడానికి నిరాకరించారు. -
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో సీఎంకు కంటి పరీక్షలు
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప గ్రామంలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో సీఎం చంద్రబాబు ఆదివారం కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు వైద్యులు జీఎన్ రావు, జి.చంద్రశేఖర్ కంటి వైద్య పరీక్షలు చేశారు. కంటికి సంబంధించిన వైద్యం ఇక మీదట సీఎం ఇంటికి వెళ్లి చేస్తామని వైద్యులు తెలిపారు. అంతకుముందు ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ఎండీ గుళ్లపల్లి నాగేశ్వరరావు, పెనమలూరు శాసనసభ్యుడు బోడెప్రసాద్, పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇక్కారెడ్డిగూడలో నేత్రదానం
చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో చనిపోయిన ఓ వ్యక్తి నేత్రాలను అతడి కుటుంబ సభ్యులు దానం చేశారు. ఆరు నెలల క్రితం గ్రామంలో 480 మంది నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వారికి అంగీకారప్రతాలను ఇచ్చారు.చేవెళ్ల రూరల్ : నేత్రదాన అంగీకర ప్రతాలను ఇవ్వడమే కాదు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు మండలంలోని చనువెళ్లి అనుబంధ గ్రామమైన ఇక్కారెడ్డిగూడ గ్రామస్తులు. గురువారం గ్రామానికి చెందిన అనుపురం శ్రీనివాస్ (35) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆయన క ళ్లను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి సిబ్బంది వచ్చి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా.. ఆరు నెలల కిత్రం 2015 సెప్టెంబర్ 6వ తేదీన మండలంలోని ఇక్కారెడ్డిగూడలోని గ్రామస్తులు 480 మంది నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చి నగరంలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వారికి నేత్రదాన అంగీకరప్రతాలను ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గ్రామస్తులంతా నేత్రదాన అంగీకార పత్రాలను అందించిన సమయంలో మృతుడు కూడా ఇచ్చాడు. దీంతో గురువారం సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది గ్రామానికి చేరుకుని కళ్లను సేకరించారు. అంగీకార పత్రాలు ఇచ్చిన ఐదు నెలల కాలంలో.. గ్రామానికి చెందిన రుక్కమ్మ చనిపోవడంతో ఆమె నేత్రాలను అందించి ఇక్కారెడ్డిగూడలో మొదటి నేత్రదాతగా నిలిచారు. ఇది జరిగిన 15 రోజులకే గ్రామానికి చెందిన చిరుమోని హనుమంతరెడ్డి చనిపోవడంతో ఆయన నేత్రాలను దానం చేయడంతో రెండో దాతగా నిలువగా ప్రస్తుతం విద్యుదాఘాతంతో మృతిచెందిన అనుపురం శ్రీనివాస్ మూడో నేత్రదాతగా నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో ఎవరు చనిపోయినా వారి నేత్రాలను ఆస్పత్రి వారికి అందిస్తామని గ్రామ యువజన సంఘం నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి (రాజు) తెలిపారు. -
480 మంది నేత్రదానానికి అంగీకారం
ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి అంగీకారపత్రాలు అందజేత చేవెళ్ల రూరల్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడకు చెందిన 480 మంది గ్రామస్తులు నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చారు. ఆదివారం వీరంతా కలసి చేవెళ్ల ఆర్డీవో చంద్రమోహన్ చేతుల మీదుగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి టెక్నికల్ డెరైక్టర్ కిషన్‌రెడ్డికి నేత్రదాన అంగీకారప్రతాలు అందజేశారు. ఇదే మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చిన ఇక్కారెడ్డిగూడవాసులు అభినందనీయులని ఆర్డీవో కొనియాడారు. -
'కార్నియా సేకరణలో మెరుగైన టెక్నాలజీ అవసరం'
విజయవాడ: లేజర్ చికిత్సలో కార్నియా సేకరించే విషయంలో మరింత మెరుగైన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని కలాం వైద్యులకు పిలుపునిచ్చారు. విజయవాడ తడిగడ్డపలోని ప్రముఖ ఆస్పత్రి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దేశంలో కంటి వైద్యంలో మరిన్ని ప్రయోగాలు జరగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన ఆస్పత్రిలో నూతనంగా ప్రవేశపెట్టిన లేజర్ చికిత్సను ప్రారంభించారు.