
ప్రమాదకరంగామారుతున్నకంటి కేన్సర్లు
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
ఆసియా, పసిఫిక్ దేశాల్లోనే కంటి కేన్సర్లు అధికం
పిల్లల్లో ప్రాణాంతక రెటినోబ్లాస్టోమా కేన్సర్
ఎల్‌వీ ప్రసాద్ ఐ ఆసుపత్రి వైద్యుల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కంట్లో ఏదైన నలతపడి కాసేపు చూడలేకపోతేనే అల్లాడిపోతాం. అలాంటిది కంటి చూపు మొత్తమే లేని జీవితాన్ని ఊహించుకోగలమా? అందుకే శరీర భాగాల్లో కంటికి అంతటి ప్రాధాన్యం. కానీ, కళ్లకు సోకే వ్యాధుల గురించి ఇప్పటికీ ప్రజల్లో పెద్దగా అవగాహన లేదు. ఇటీవల కాలంలో వివిధ రకాల కేన్సర్లపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అయితే కేన్సర్ అంటే ఊపిరితిత్తులు, రొమ్ము, చర్మానికి, కిడ్నీ, లివర్ ఇతర అవయవాలకు మాత్రమే సంబంధించినదనే అపోహ ఉంది. కానీ, కేన్సర్ భూతం కళ్లపైనా దాడి చేస్తుంది. వెంటనే గుర్తించకుంటే జీవితమే అంధకారమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పెరుగుతున్న కంటి కేన్సర్ బాధితులు
మనదేశంలో కంటి కేన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా బాల్య కంటి కేన్సర్ల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. పిల్లల్లో ప్రాణాంతకమైన రెటీనోబ్లాస్టోమా కలవరపెడుతోంది. ఆసియా, పసిఫిక్ దేశాల్లోనే ఈ కేన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. పదేళ్ల వయసు పైబడిన వారిలో ఆక్కులర్ సర్ఫేస్ స్క్వామస్ నియోప్లసియా (ఓఎస్‌ఎ‹స్‌ఎన్), సెబాసియస్ గ్లాండ్ కార్సినోమా సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.
కనురెప్పల కేన్సర్లలో 53 శాతం సెబాసియస్ గ్లాండ్ కార్సినోమా ఉంది. కంటిలో ఉన్నట్లుండి కణతులు రావడం, కన్ను నొప్పి పెట్టడం, వాపు రావడం, ఆకారంలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెటినోబ్లాస్టోమా వ్యాధితో బాధపడుతున్న పిల్లల్లో త్వరితగతిన గుర్తించడం, అవగాహన, చికిత్సలు అందించడానికి ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ మే నెలలో వార్షిక మైటథాన్ పరుగు నిర్వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment