హైదరాబాద్‌లో ప్రియాంక గాంధీ
హైదరాబాద్‌లో ప్రియాంక గాంధీ
Published Sat, Feb 18 2017 12:51 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ దంపతులు హైదరాబాద్ వచ్చారు. ప్రియాంక గాంధీ కుమారుడు రైహన్‌కు కంటి సంబంధిత ఆపరేషన్ నిమిత్తం వారు నగరానికి వచ్చారు. రైహన్ క్రికెట్ ఆడుతుండగా కంటికి గాయమైనందున ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందాడు. కాగా ఎయిమ్స్ వైద్యులు సిఫారసు చేయడంతో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వచ్చారు.
ప్రత్యేక వైద్య బృందం రైహన్ కు పరీక్షలు నిర్వహిస్తోంది. ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రిలో పోలీసులు భద్రతను పెంచారు. గుళ్లపల్లి ప్రతిభారావు బ్లాక్‌లో ప్రియాంక దంపతులు ఉన్నారు. వీరి వెంట పింకీ రెడ్డి వచ్చారు. కాగా, ప్రియాంక పర్యటన గురించి తమకు తెలియదని, ఇది వారి వ్యక్తిగత పర్యటన అని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.
Advertisement
Advertisement