
480 మంది నేత్రదానానికి అంగీకారం
ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి అంగీకారపత్రాలు అందజేత
చేవెళ్ల రూరల్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడకు చెందిన 480 మంది గ్రామస్తులు నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చారు. ఆదివారం వీరంతా కలసి చేవెళ్ల ఆర్డీవో చంద్రమోహన్ చేతుల మీదుగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి టెక్నికల్ డెరైక్టర్ కిషన్‌రెడ్డికి నేత్రదాన అంగీకారప్రతాలు అందజేశారు. ఇదే మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చిన ఇక్కారెడ్డిగూడవాసులు అభినందనీయులని ఆర్డీవో కొనియాడారు.