
ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క షేర్ చేసిన ఫొటో
సాక్షి, హైదరాబాద్ : క్రికెటర్ విరాట్ కోహ్లి తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు బర్త్‌డే రోజున(సోమవారం) విలువైన బహుమతిని అందజేశారు. పెళ్లి తర్వాత ఇది అనుష్క తొలి బర్త్‌డే కావడంతో కోహ్లి ప్రత్యేక కానుక ద్వారా తన ప్రేమను వ్యక్తం చేశారు. ఐపీఎల్ టైటిల్‌పై ఆశలు నిలుపుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(ఆర్‌సీబీ) విజయాన్ని అందుకొంది. ఆర్‌సీబీ సారధి కోహ్లి ఈ ప్రత్యేక విజయాన్ని తన భార్యకు బర్త్‌డే గిఫ్ట్ అని తెలిపారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ 5వ స్థానానికి చేరింది.
నిన్న(మంగళవారం) ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 14 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉదయం భార్య అనుష్కకు ట్విటర్ ద్వారా విషెస్ తెలిపిన కోహ్లి, మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘నా భార్య అనుష్క ఇక్కడే ఉంది. ఈ రోజు తన బర్త్‌డే.. ఈ విజయం తనకో చిన్న కానుక. తను ఈ మ్యాచ్ విజయాన్ని ఆస్వాదించడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. ఈ విజయం చాలా ప్రత్యేకమైంది’ అని తెలిపారు.
దీనిపై అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘ఈ ప్రత్యేకమైన బర్త్‌డేను అత్యంత దయ కలిగిన, తెలివైన, ప్రియమైన, ధైర్యవంతుడైన వ్యక్తితో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ రాసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment