Watch: Virat Kohli Dance With Wife Anushka Sharma On Punjabi Song, Video Goes Viral - Sakshi
Sakshi News home page

అనుష్కతో కలిసి డ్యాన్స్‌ చేసిన కోహ్లి.. అంతలోనే విరాట్‌ కాలికి! ఏం జరిగిందంటే?

Published Mon, Apr 24 2023 6:23 PM | Last Updated on Mon, Apr 24 2023 6:44 PM

Virat Kohli Dance With Wife Anushka On Punjabi Song - Sakshi

PC: Twitter

టీమిండియా మాజీ కెప్టెన్‌, ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌-2023లో బీజీబీజీగా ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఆర్సీబీ స్టాండింగ్‌ కెప్టెన్‌గా విరాట్‌ వ్యవహరిస్తున్నాడు. రెగ్యూలర్‌ కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ గాయంతో బాధపడుతుండంతో మరి కొన్ని మ్యాచ్‌లకు కోహ్లినే నాయకత్వం వహించే అవకాశం ఉంది. 

ఈ సీజన్‌లో పంజాబ్‌, రాజస్తాన్‌తో మ్యాచ్‌ల్లో ఆర్సీబీ సారధిగా వ్యవహరించిన విరాట్‌.. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ తమ జట్టుకు విజయాలను అందించాడు. ఇక వ్యక్తిగత ప్రదర్శనలో కూడా విరాట్‌ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 279 పరుగులు సాధించాడు. విరాట్‌ ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో నాలుగో స్థానంలో ఉన్నాడు.

అనుష్కతో కలిసి డ్యాన్స్‌ చేసిన విరాట్‌..
ఇక ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కేకేఆర్‌తో ఆర్సీబీ తలపడిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌కు ముందు జిమ్‌లో విరాట్‌ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ఓ పంజాబీ పాటకు వీరిద్దరూ స్టేప్పులు వేశారు. అయితే కొన్ని సెకన్లకే కాలు పట్టేయడంతో  కోహ్లి పక్కకు వెళ్లిపోయాడు. దీంతో అనుష్క ఒక్క సారిగా గట్టిగా నవ్వింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: #David Warner: ఉప్పల్‌లో కింగ్‌.. టైటిల్‌ వీరుడు! అప్పుడు మా వార్నర్‌ అన్న.. ఇప్పుడు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement