
అనుష్కశర్మ
బెంగళూరు : సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్‌చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడంతో బాలీవుడ్ నటి, కోహ్లి సతీమణి అనుష్క శర్మ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రతి మ్యాచ్‌కు హాజరై..గ్యాలరీలో సందడి చేసిన అనుష్క గురువారం జరిగిన మ్యాచ్‌కు హాజరుకాలేదు. షూటింగ్ బిజీ వల్ల రాలేకపోయినా అనుష్క మ్యాచ్‌ను మాత్రం టీవీలో ఆస్వాదించించారు. మ్యాచ్ ఆసాంతం సోషల్ మీడియాలో కమాన్ బాయ్స్.. అంటూ వరుస పోస్ట్‌లతో ఆర్సీబీకి మద్దతు తెలిపారు.
ఏబీ డివిలియర్స్ (39 బంతుల్లో 69; 12 ఫోర్లు, 1 సిక్స్), మొయిన్ అలీ (34 బంతుల్లో 65; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత భాగస్వామ్యం, గ్రాండ్‌హోమ్ (17 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్స్‌లు), సర్ఫరాజ్ ఖాన్ (8 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్)ల మెరుపు ఇన్నింగ్స్‌లతో బెంగళూరు 218 పరుగులు భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ లక్ష్య చేధనలో ఏమాత్రం తడబడని సన్‌రైజర్స్ చివరి వరకు పోరాడి ఆకట్టుకుంది. కేన్ విలియమ్సన్ (42 బంతుల్లో 81; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), మనీశ్ పాండే (38 బంతుల్లో 62 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కడవరకు పోరాడినా విజయం బెంగళూరునే వరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment