పవన్ పుట్టినరోజు కానుకగా...! | Powerstar pawankalyan Ex-wife Renu desai to give a special gift | Sakshi
Sakshi News home page

పవన్ పుట్టినరోజు కానుకగా...!

Published Mon, Aug 25 2014 11:20 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ పుట్టినరోజు కానుకగా...! - Sakshi

పవన్ పుట్టినరోజు కానుకగా...!

 ‘బద్రి’, ‘జానీ’ చిత్రాలతో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన రేణుదేశాయ్ ఆ మధ్య నిర్మాతగా మారారు. మరాఠీలో ‘మంగలాష్టక్ వన్స్‌మోర్’ అనే సినిమా తీసి విజయం సాధించారు. ఆ ఆనందంతో మెగాఫోన్ చేతబట్టారు. మురాఠీలోనే ‘ఇష్క్ వాలా లవ్’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆమె తెలుగులో అనువదించి విడుదల చేయాలనుకుంటున్నారు. తన మాజీ భర్త పవన్ కల్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని సెప్టెంబర్ 2న మరాఠీ వెర్షన్ ప్రచార చిత్రాలను విడుదల చేయనున్నారు. ఇది తన జీవితానికి కీలకమైన వేడుక కాబట్టి, పవన్ పుట్టినరోజున విడుదల చేస్తున్నానని పేర్కొన్నారు. తన కుమార్తె ఆద్య పేరుతో ‘శ్రీ ఆద్య ఫిలింస్’ పతాకంపై తన కుమారుడు అఖీరానందన్ నిర్మాతగా రేణు ఈ చిత్రం చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement