అద్భుతం... అమోఘం... | Rudrama Devi First Look, a wonderful birthday gift for Anushka Shetty | Sakshi
Sakshi News home page

అద్భుతం... అమోఘం...

Published Thu, Nov 7 2013 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM

అద్భుతం... అమోఘం...

అద్భుతం... అమోఘం...

కొన్ని పాత్రలకు ఫలానా తారలే బాగుంటారని ఫిక్స్ అయిపోతాం. అలా ‘అరుంధతి’లో జేజమ్మ పాత్ర చూసినప్పుడు అనుష్క తప్ప ఎవరూ సూట్ కారని చాలామంది అన్నారు. అలాగే ‘వేదం’లో అమలాపురం సరోజ పాత్రకు అనుష్కే యాప్ట్ అన్నారు. తాజాగా ‘రుద్రమదేవి’ లుక్ చూసిన తర్వాత, ఈ ధీరవనిత పాత్రకు వంద శాతం అనుష్కే కరెక్ట్ అనే మాట చాలామంది నోట వినిపిస్తోంది. గుణా టీమ్ వర్క్స్ పతాకంపై కాకతీయ వీరనారి రాణీ రుద్రమదేవి పాత్రలో అనుష్క నటిస్తున్న చిత్రం ‘రుద్రమదేవి’.
 
 గుణశేఖర్ దర్శకత్వంలో శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో రూపొందుతున్న తొలి భారతీయ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రీడీ చిత్రం ఇది.నేడు అనుష్క పుట్టినరోజుని పురస్కరించుకుని, ‘రుద్రమదేవి’గా ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ -‘‘గత ఏడాది అనుష్క పుట్టినరోజు నాడు ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించాం. అయితే, అంతకుముందు ఏప్రిల్ నుంచి ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, కసాములో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారామె. అద్భుతంగా... అమోఘంగా ఇందులో అనుష్క కనిపిస్తారు. 
 
పోరాట సన్నివేశాలను ఆమె అద్భుతంగా చేస్తున్నారు. హీరోలకే సవాల్ అనిపించే కఠినతరమైన ఫీట్స్‌లో ప్రేక్షకులను అలరించబోతున్నారు అనుష్క. ఇప్పటివరకు జరిపిన షెడ్యూల్స్‌తో 50 శాతం సినిమా పూర్తయ్యింది. ఆరు పాటల్లో ఐదు పాటల చిత్రీకరణ పూర్తి చేశాం. వచ్చే మార్చికి షూటింగ్ పూర్తవుతుంది. ఈ 16న తాజా షెడ్యూల్ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. రానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను నిత్యామీనన్, మరో పాత్రను కేథరిన్ చేస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలను కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్, సుమన్ తదితరులు పోషిస్తు న్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement