రష్మిక మందన్నా..ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఈమె. చేసింది కొన్ని సినిమాలే అయినా ఈ అమ్మడి పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఏప్రిల్5న రష్మిక మందన్నాపుట్టినరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.. ఈ సంవత్సరం మరెన్నో విజయాలు పొందాలని, నువ్వు కోరుకున్నవన్నీ నెరవాలని కోరుతూ బర్త్‌డే విషెస్ తెలిపారు.
దీనిపై స్పందించిన రష్మిక..తనకు బర్త్‌డే గిఫ్ట్ కావాలని, సెట్లో కేక్ కట్ చేయించే వరకు ఊరుకోనని, ఫన్నీగా కామెంట్ చేసింది. దీంతో తప్పకుండా.. త్వరలోనే సెట్లో కలుద్దాం అంటూ అల్లు అర్జున్ బదులిచ్చారు. దీనికి సంబంధించిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక అల్లు అర్జున్- రష్మిక 'పుష్ప' సినిమాలో జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు13న విడుదల కానుంది.
Thankyou so so much @alluarjun saaaaaarrrr! ❤️ I want my gifttttt.. I am going to bother you to cut the cake with me when I am back on the set.. 🎉💃🏻🥳 https://t.co/VIwnycWf2L
— Rashmika Mandanna (@iamRashmika) April 5, 2021
చదవండి: రష్మిక ఫస్ట్‌లుక్ ఎక్కడంటూ ఫ్యాన్స్ ఫైర్
రష్మిక ఫస్ట్ ఆడిషన్: వీడియో రిలీజ్ చేసిన మాజీ ప్రియుడు
Comments
Please login to add a commentAdd a comment