
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఆమిర్ ఖాన్ 57వ బర్త్‌డే. ఈ సందర్భంగా ప్రమఖులు సహా నెటిజన్ల నుంచి ఆయనకు బర్త్‌డే విషెస్ అందుతున్నాయి. ఈ నేపథ్యంలో తన మాజీ భార్య కిరణ్ రావు నుంచి ఇటీవలె ఓ బహుమతి అందిందని, అది తన జీవితంలోనే ఉత్తమమైన గిఫ్ట్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీసెంట్‌గా కిరణ్‌తో మాట్లాడాను. ఈ క్రమంలో నా లోపాలు, బలహీనతల గురించి ఓ లిస్ట్ తయారు చేయమని చెప్పాను. ఆమె నాకు ఓ 10-12 పాయింట్స్‌తో ఓ జాబితా తయారు చేసి ఇచ్చింది. అది నా లైఫ్‌లోనే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. కాగా 2021లో అమిర్ ఖాన్- కిరణ్ రావు విడిపోయిన సంగతి తెలిసిందే.
15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఇకపై తాము భార్యాభర్తలం కాదని సోసల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'ఇకపై మేం భార్యాభర్తలం కాదు. కానీ ఒకరికొకరం ఫ్యామిలీగా, పేరెంటింగ్ బాధ్యతలను కలసి పంచుకుంటాం’ అని ఆమిర్, కిరణ్ రావులు ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment