త్రివిక్రమ్‌కు రూ.6 కోట్ల గిఫ్ట్‌ ఇచ్చిన స్టార్‌ హీరో! | Star Hero Surprise Gift To Trivikram Srinivas | Sakshi
Sakshi News home page

Trivikram Srinivas: త్రివిక్రమ్‌కు రూ.6 కోట్ల గిఫ్ట్‌ ఇచ్చిన స్టార్‌ హీరో!

Published Sat, Nov 11 2023 6:09 PM | Last Updated on Sat, Nov 11 2023 6:13 PM

Star Hero Surprise Gift To Trivikram Srinivas - Sakshi

టాలీవుడ్‌లో కొందిమంది డైరెక్టర్లకి మాత్రమే ఫ్యాన్స్‌ ఉంటారు. అలాంటి వాళ్లలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఒకరు. ఆయనను సామాన్యులే కాదు స్టార్‌ హీరోలు సైతం అభిమానిస్తారు. ఆయనలోని దర్శకత్వ ప్రతిభ కంటే ఆయన కలం నుంచి జారువాలే పదునైన సంభాషణలకు ఫ్యాన్స్‌ ఎక్కువ. తనదైన మాటలతో ప్రేక్షకులను నవ్విస్తాడు.. ఏడిపిస్తాడు.. ఆలోచింపజేస్తారు. అందుకే ఆయనను తెలుగు ప్రేక్షకులు ముద్దుగా ‘మాటల మాంత్రికుడు’అని పిలుచుకుంటారు. ఆయన బర్త్‌డే(నవంబర్‌ 7)ను ప్రతి యేటా పండుగలా జరుపుకుంటారు. ఈ సారి కూడా త్రివిక్రమ్‌ బర్త్‌డే గ్రాండ్‌గా సెలెబ్రేట్‌ చేసుకున్నారు అభిమానులు. పలువురు సినీ తారలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.  ఓ హీరో మాత్రం బర్త్‌డే విషెస్‌తో పాటు ఖరీదైన బహుమతిని అందజేశాడట. 

ఏంటా బహుమతి?
త్రివిక్రమ్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’నుంచి ఫస్ట్‌ సింగిల్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇప్పుడా పాట మహేశ్‌ ఫ్యాన్స్‌ ఫెవరేట్‌ ట్రాక్‌గా మారింది.  ఈ సంగతి పక్కకి పెడితే.. బర్త్‌డే రోజు త్రివిక్రమ్‌కి ఖరీదైన బహుమతి అందిందనే రూమర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. టాలీవుడ్‌కి చెందిన ఓ ఆగ్రహీరో రూ.6 కోట్ల విలువ చేసే ప్రాపర్టీనీ బహుమతిగా అందించాడట. ఇప్పుడీ గిప్ట్‌ రూమర్‌ టాలీవుడ్‌ని షేక్‌ చేస్తోంది.

ఎవరా హీరో?
త్రివిక్రమ్‌ కొంతకాలంగా  టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరోకి సపోర్ట్‌గా ఉంటున్నాడు. ఆ హీరో చేయాల్సిన సినిమాలకు స్టోరీస్‌, డైరెక్టర్స్‌ను సెట్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందుకే పుట్టిన రోజు కానుకగా ఆ హీరో త్రివిక్రమ్‌కు రూ. 6 కోట్ల విలువ చేసే బహుమతిని అందించారట. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ.. సోషల్‌ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement