ప్రధానికి సైనా ‘రాకెట్’ | Saina Nehwal gifts special racquet to Prime Minister | Sakshi
Sakshi News home page

ప్రధానికి సైనా ‘రాకెట్’

Published Thu, Sep 17 2015 2:00 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

ప్రధానికి సైనా ‘రాకెట్’ - Sakshi

ప్రధానికి సైనా ‘రాకెట్’

 బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన బ్యాడ్మింటన్ స్టార్
 న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. గురువారం ప్రధాని నరేంద్ర మోదిని కలిసింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిపెట్టిన రాకెట్‌ను ఈ సందర్భంగా ఆమె ప్రధానికి బహుకరించింది. అలాగే నేడు 65వ పడిలోకి అడుగుపెడుతున్న మోదికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. ‘ప్రధానిని కలిసినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఓ రోజు ముందుగానే బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపా. జన్మదిన కానుకగా రాకెట్‌ను బహుకరించా. మోది ప్రతి ఆటను క్రమం తప్పకుండా ఫాలో అవుతారని తెలిసి చాలా సంతోషపడ్డా. అలాగే నా మ్యాచ్‌ల గురించి చాలా చర్చించారు. చాలా ఆశ్చర్యమనిపించింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించినందుకు అభినందనలు తెలిపారు’ అని సమావేశం అనంతరం సైనా వ్యాఖ్యానించింది. ప్రధానిని కలిసిన వారిలో సైనా తండ్రి హర్వీర్ నెహ్వాల్, ఐఓఎస్ సీఈఓ నీరవ్ తోమర్‌లు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement